గోదారమ్మ కొంగు పట్టుకుని నడిచే వేళ!

గోదారమ్మ కొంగు పట్టుకుని నడిచే వేళ!


 


పవిత్ర గంగానది ఆకాశం నుంచి భువిపైకి పారితే... గోదారమ్మ తెలంగాణలో పాతాళం నుంచి ఎత్తుగడ్డకు పారబోతున్నది. | ఉద్యమ సూరీడు చేసిన విన్నపాన్ని మన్నించి.. కాళేశ్వరం కాలుడి సాక్షిగా కలను సాకారం చేసుకుంటున్న వేళ తెలంగాణ ఉద్యమ పొలికేక కాస్తా జలకేకగా మారుతోంది.


కరుడుగట్టిన కార్యదక్షతకు కాళేశ్వరుడు సాక్షీభూతంగా నిలిచిన వేళ కెసిఆర్ కన్న జలకల సాకారం కాబోతున్నది. పాలకుడి పట్టుబడితే కాని కార్యం ఉంటుందా అన్న అద్భుత ఘట్టం ఆవిష్కృతం కాబోతున్నది.


 



విమర్శలకు జడుస్తూ పోతే పనులు చేయలేమన్న అకుంఠిత దీక్ష తీసుకున్న ఆ బక్కపల్చని వ్యక్తే బాహుబలిగా కార్యాలను సాకారం చేసే సాధుశిల్పిగా తెలంగాణ ప్రజల | కట్టెదుట నిలిచారు. కరీంనగర్ తొలి తెలంగాణ విప్లవ సభలో బక్క పల్చని నేను..


గాలొస్తే ఉఫ్న కొట్టుకు పోతానన్న వ్యక్తే | ఇవాళ గోదారమ్మను తెలంగాణ పాదాక్రాంతం చేశారు. తెలంగాణ బిడ్డల ఆర్తనాదాలను గోదారమ్మకు వినిపించి మనసు | కరిగించి తనవెంట రావాలని అర్థించి...మన పొలాలకు నీళ్లు పారించబోతున్న వేళ.. ఇంతకన్నా సుదినం ఉంటుందా అని ఆలోచించాలి.



 


అంతర్జాతీయంగా అంతా యోగాలో మునిగే వేళ మన తెలంగాణలో మాత్రం గోదారమ్మకు పూజలు చేసుకునే మహత్తర ఘట్టం మనముందు రాబోతున్నది. తెలంగాణ | సిద్ధాంతకర్త జయశంకర్ సారు కలగన్న జలస్వప్నం సాకారం | అవుతున్న వేళ ఆయన పేరుతో ఏర్పడ్డ జయశంకర్ జిల్లాలో జయశంకర్ వర్ధంతి రోజు అయిన జూన్ 21ననే ఈ మహత్కార్యం సాకారమవుతున్న అద్భుత జలతరంగమే మన కాళేశ్వరం.


ఇన్ని మంచిరోజులు కలసిన వేళ కాళేశ్వరం ప్రారంభం కూడా తోడై తెలంగాణ నేలలు గోదారమ్మ పాద స్పర్శతో పులకరించనున్నాయి. తెలంగాణ వస్తే ఏమొస్తదన్న వారికి ఒక్కో రకంగా సమాధానం చెబుతూ ముందుకు సాగుతున్న కెసిఆర్ అన్న మూడక్షరాలు ఓంకారంగా ధ్వనిస్తున్నాయి.


 



చరిత్రకు ఎదురీది ప్రత్యేక రాష్ట్రాన్ని | సాధించుకున్న తెలంగాణ.. ఇప్పుడు ఏటికి ఎదురేగి' ప్రాజెక్టుల్ని సాకారం చేసుకుంటోంది. తొలి విజయంగా నిరంతర విద్యుత్ | తరంగాలను అందుకున్న తెలంగాణ పుడమి ఇప్పుడు జలతరంగాలను కూడా ఆస్వాదించబోతున్నది.


నీరు పల్లమెరుగు అనే సామెతను తిరగరాసి వరద గోదావరికి ఎదురెక్కేలా నడకలు నేర్పబోతోంది. ఉపనది ప్రాణహిత నీటిని జీవనదిలోకి ఎత్తిపోసి గోదావరికి కొత్త జీవం ఇవ్వబోతోంది. కాళేశ్వరుడి జటాజూటం నుంచి దిగిన గంగమ్మ తల్లి లాగానే ఇప్పుడు ఆ కాళేశ్వరుడు | ఉన్నచోటు నుంచే ప్రాణహిత గంగ తెలంగాణ పొలాల్లోకి తరలిరానుంది.


 



ఇదో అద్భుత మాయామశ్చీంద్రగా చూపరులను ఆకట్టుకునే త్రీడి చిత్రంగా చెప్పుకున్నా ఆశ్చర్యం లేదు. సముద్రుని చెంతకే ఏటా వెళుతున్న గోదావరి ఇక కాళేశ్వరం, ఆ తరవాత పోలవరంతో తన గతిని మార్చుకోక తప్పదు. గోదారమ్మ వేగానికి అడ్డుకట్టలు పడుతున్న వేళ తెలుగునేల పచ్చని పైర్లతో పుకరించనుంది.


బీళ్లు వారిని మన పొలాలు నీటి అలికిడికి నర్తించనున్నాయి. దశాబ్దాల అస్తిత్వ ఉద్యమంలో మొదటి పోరాటమంతా నీళ్ల కోసమే. పోరాటంలో మొదటి నినాదమూ నీళ్ల కోసమే. జయశంకర్ సార్ కలలుకన్న ఆశయమే ఇప్పుడు కెసిఆర్ రూపంలో నెరవేరబోతున్నది.



 


కిందినుంచి | గలగలా గోదారమ్మ ఉరకలు వేస్తున్నా అందుకోలేని అభాగ్యుల్లా | ఇంతకాలం వింతగా చూసిన మనం ఇక గుండెలపై చేరు||వేసుకుని బతకగలం. ఇన్నాళ్లూ తెలంగాణ పొలాలకు తడి | అంటలేదు. వరుణుడు కరునిస్తేనే మడి తడిచేది.


మిగతా సమయాల్లో ఏడ్చేది. ఇన్నాళ్లూ నన్ను అదిమిపట్టు కోండని గోదారమ్మ చేసిన సవ్వడిని వినిపించుకున్న నాధుడు లేకుండా పోయాడు. చేయందిస్తే నీతో వస్తానన్న ఆ తల్లి మాట ఆలకించిన మన కెసిఆర్ ఆమెను తనవెంట తీసుకుని నడిపించి తీసుకుని వస్తున్న అపర భగీరథుడిలా నిలిచాడు.



 


ఈ రకంగా తెలంగాణ ఇప్పుడు జలకలను సాకారం చేసుకుంటోంది. రికార్డు సమయంలో పూర్తయిన కాళేశ్వరం బహుళార్థ సాధక | ఎత్తిపోతల ప్రాజెక్టు ప్రారంభానికి సర్వం సిద్ధమైంది. వికారినామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠ బహుళ చవితి పంచమి శు క్రవారం రోజు... అంటే నేడే సుముహూర్తంలో కాళేశ్వరాన గోదారమ్మ పులకించనుంది.



గోదావరికి మళ్లీ నిరంతర నీటి సవ్వడి కల్పించే శుభతరుణంలో తెలంగాణ గొంతుకలు పిక్కటిల్లనున్నాయి. | ఇసుక పర్రలుగా మారిన నిండు నదిలో లేచిన మహా కట్టడమొకటి గోదారమ్మకు స్వాగతం పలుకనున్నాయి. ప్రపంచంలోని అతి పెద్ద బహుళ ఎత్తిపోతల పథకమైన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభ సంబురాలను తెలంగాణవ్యాప్తంగా ఊరూవాడా నిర్వహించుకోవడం ద్వారా మనసులు | పులకరించనున్నాయి.


 



కాళేశ్వరం ప్రాజెక్టు ఇక తెలంగాణకు తరగని ఆస్తిగా బంగారు గనిగా నిలిచిపోనుంది. సాగు, తాగునీటి సమస్యలే ఉండవన్న కల సాకారం కానుంది. అందుకే సాగునీటి ప్రాజెక్టుల చరిత్రలో ఇదో సరికొత్త అధ్యాయం సృష్టించబోతున్నది.


దేశంలోనే ఇంత భారీ, ఇంతటి ఖరీదైన సాగునీటి ప్రాజెక్టు మరోటి లేదన్న ప్రశంసలు ఆయన లక్ష్యాన్ని మరింత ఉత్తేజితం చేయాలి. ఎత్తిపోతల పథకాల్లో ప్రపంచంలోనే అరుదైన ఘనత దీనిదని చాటాలి. అందుకే నేడు కాళేశ్వరం పేరు దేశమంతా మోగిపోతోందనడంలో సందేహం లేదు.


 



తెలంగాణ ఏర్పాటుతో పాటు, ఈ స్వప్నాన్ని అకుంఠిత దీక్షతో అతి తక్కువ కాలంలోనే సాకారం చేస్తున్న కేసీఆర్ నిజంగానే బాహుబలి అనడంలో, కార్యదక్షతకుమారు పేరనడంలో సందేహం లేదు. సాహో కెసిఆర్ |..నదీ ప్రవాహానికి అభిముఖంగా ఎదురొడ్డి నడిపించే మహా ఇంజినీరింగ్ అద్భుతం ఆవిష్కృతం కాబోతున్న వేళ తెలంగాణ సిఎం కెసిఆర్ కు జేజేలు.


 


 


Comments