చురుకుగా జలశక్తి అభియాన్

చురుకుగా జలశక్తి అభియాన్


 


గుర్తించిన గ్రామాల్లో కార్యాచరణ ప్రజలను చైతన్యం చేసే ప్రయత్నాలు


 


న్యూఢిల్లీ : జలశక్తి అభియాన్... జల సంరక్షణపై ప్రధాని నరేంద్ర మోదీ అత్యంత శ్రద్ధ కనబరుస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా జులై 1 నుంచి సెప్టెంబరు 15 వరకు ఎంపిక చేసిన జిల్లాల్లో అమలు చేస్తున్నారు. జల సంపద సృష్టి చైతన్య కార్యక్రమాల ద్వారా ప్రజా ఉద్యమంగా దీన్ని చేపట్టారు.


 


గ్రామీణ భారతంలో కాల పరిమితితో కూడిన జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలు సాగుతున్నాయి. ఆయా రోజుల్లో సంబంధిత అధికారులు, భూగర్భ జల నిపుణులు, ఇంజినీర్లు తదితరులంతా జలసంరక్షణ కార్యక్రమాల్లో నిమగ్నమవుతున్నారు.


 



 


జలశక్తి కింది ప్రత్యేకించి వేసవిలోను, వర్షాభావంతోను ఎండి పోయిన వివిధ ప్రాంతాల్లో జల సంరక్షణకు ప్రాధాన్యం ఇస్తారు. ఈమేరకు అధికారులు తమ నివేదికలను జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు, పారిశు విభాగానికి చెందిన పోర్టల్లో సమర్పిస్తారని సిబ్బంది వ్యవహారాల శాఖ ఆదేశాల్లో పేర్కొంది.


 


ఇప్పటికైనా కేంద్ర రాష్ట్రాలు ముందుకు వచ్చి జలసంరక్షణను యుద్ధప్రాతిపదికకన చేపట్టాల్సి ఉంది. తమిళనాడులో నీటి సమస్య విశ్వరూపం దాల్చింది. రాష్ట్ర రాజధాని చెన్నై నీటి కోసం అల్లాడిపోతోంది.. దీంతో పొరుగు రాష్ట్రాల నుంచి అందాల్సిన నీటి కోసం తమిళనాడు ప్రభుత్వం ప్రయత్నించడంతోపాటు ప్రత్యామ్నాయ మార్గాలనూ అన్వేషిస్తోంది.


 



 


తమిళనాడులో గతేడాది విపరీతమైన వరదలు వచ్చి చైన్నై నగరం నిండా మునిగింది. అలాంటి నగరంలో ఇప్పుడు మంచినీటి బొట్టుకోసం ప్రజలు తహతహలాడుతున్నారు. సముద్రం తలాపునే ఉన్నా మంచినీటి సమస్య తప్పడం లేదు. ట్యాంకర్ల కోసం ఎదురు చూస్తున్నారు.


 


నీటి సమస్యలపై దీర్ఘకాలిక ప్రణాళికలు లేకపోవడంతో దేశంలో నీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుంది. వనరులను సద్వినియోగం చేసుకునే చిత్తశు నేతల్లో కొరవడింది. దూరదృష్టి లేని నేతలు రాజ్యాలు ఏలడం వల్ల నీటి సమస్య ఏటేటా పెరుగుతోంది. తమిళనాడు దీనికి ప్రబల ఉదాహరణగా చూడాలి.


 



 


ఐదేళ్ల పాలనా కాలంలో కష్టపడితే జీవితాంతం నీటి సమస్య లేకుండా చేసుకునే అవకాశాలు ఉన్నా ప్రభుత్వాలు అటువైపు దృష్టి సారించడం లేదు. సైకిళ్ల పంపిణీ, చీరలు ధోతుల పంపిణీలు ముఖ్యం కాదు. మంచినీటి ఎద్దడి లేకుండా ఐదేళ్ల ప్రణాళికలు రచించి ముందుకు సాగితే తప్ప రాష్ట్రాలు మనుగడ సాగించవని గుర్తుంచుకోవాలి.


 


ఈ నేపథ్యంలో జల సంరక్షణను ప్రజా ఉద్యమంలా చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధం కావడం ఆహ్వానించ దగ్గ విషయం. దేశంలో తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్న 255 జిల్లాలకు ఇన్ ఛార్జులుగా సీనియర్ అధికారులను నియమించింది. అదనపు, సంయుక్త కార్యదర్శులు సహా పలువురు ఉన్నతాధికా రులను కేంద్ర ప్రభారీ అధికారులుగా రంగంలోకి దించింది.


 



 


కొద్ది రోజుల్లో ప్రారంభం కానున్న జలశక్తి అభియాన్ లో భాగంగా వీరంతా ఆయా జిల్లాల్లో జల సంరక్షణ, సమర్థ నీటిపారుదల కార్యక్రమాలకు ప్రణాళికలు రూపొందించారు. మొత్తం 255 మంది ఉన్నతాధికారులు.. డైరెక్టర్ లేదా డిప్యూటీ కార్యదర్శి స్థాయి కేంద్ర ప్రభుత్వ అధికారులతో పాటు వివిధ స్థాయిల రాష్ట్ర స్థానిక అధికారులు, భూగర్భ జల నిపుణులు, ఇంజినీర్లతో కూడిన బృందాలతో సమన్వయంగా పని చేస్తున్నారు.


 


ఈమేరకు సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆదేశాలిచ్చింది. గుర్తించిన బ్లాక్ లు, జిల్లాల్లో ఈ బృందాలు పర్యటించి.. జల సంరక్షణ తదితర కార్యక్రమాలు సమర్థంగా అమలయ్యేలా చర్యలు చేపడుతున్నారు. రుతుపవనాలు జాడలేక పోవడంతో మంచినీటి సరఫరా అన్నది కానరావడం లేదు.


 



 


దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల్లో ప్రజలకు నీళ్లు దొరకడం లేదు. పలుచోట్ల పరిస్థితి దయనీయంగా మారింది. తమిళనాడు వంటి రాష్ట్రాల్లో కనీవినీ ఎరుగని రీతిలో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. బిందెడు నీటిని బంగారంలా భావించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.


 


తాగునీటి కొరతతో చెన్నైలో కొన్ని కంపెనీలు ఉద్యోగులను ఇంటినుంచే పనిచేయాలని సూచిస్తున్నాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టమవుతోంది. ఇక్కడేనా అంటే రాజస్థాన్ ,గుజరాత్లో కూడా ఇలాంటి పరిస్థితులే ఉన్నాయి. ఆంధ్రాలో కొన్ని జిల్లాలు, తెలంగాణలో కొన్ని జిల్లాలు కూడా ఇందకు విరుద్ధంగా లేవు.


 



 


ఇదంతా పాలకుల నిర్లక్ష్య ధోరణి, అనుభవరాహిత్యం, సమస్యలపట్ల చిత్తశుద్ది లేకపోవడం కారణంగా భావించాలి. నిజానికి ఇలాంటి నపివేదికలు గతంలో తయారు చేసి ఉన్నాయి. కొత్తగా వీరు ఇప్పుడు చేసే అధ్యయనం వల్ల కాలయాపన తప్ప మరోటి కాదు. నిజానికి ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం జలవనరులపై అధ్యయనం చేసి, ముందుకు సాగాలి.


 


 


Comments