గిరిజన గూడాల్లో మళ్లీ జ్వరాలు

గిరిజన గూడాల్లో మళ్లీ జ్వరాలు


రవాణా సౌకర్యం లేక వైద్యానికి ఇబ్బందులు  


 


ఆదిలాబాద్: గిరిజన గూడాల్లో విషజ్వరాలెఉ మరోమారు భయపెడుతున్నాయి. రవాణా సౌకర్యం లేకపోవడంతో వైద్యం కోసం వారు గూడాలను వదిలి రాలేక పోతున్నారు. ఒక్కొ ఇంట్లో కనీసం ఇద్దరు సభ్యులు జ్వరాలతో బాధపడుతున్నారు. డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, చికెన్ గున్యా, కామెర్లతో గిరిజనులు నరకం చూస్తున్నారు. 


 



దీని ప్రభావంతో ప్రైవేట్ ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నా ప్రత్యేక క్యాంపులకు మాత్రం చర్యలు తీసుకోవడం లేదు. ఇకపోతే సింగరేణి కుటుంబాలపై జ్వరం పంజా విసురుతోంది.. ఫలితంగా బొగ్గుగని కార్మికులు, వారి కుటుంబసభ్యులు విలవిల్లాడు తున్నారు.  


 



పెద్దాచిన్నా ముసలీ ముతకా అనే తేడా లేకుండా అందరూ మంచం పట్టారు. సింగరేణిలో జ్వరాలు ప్రబలేందుకు అసలు కారణం దోమలే.. కార్మికవాడలు చిట్టడవులను తలపిస్తున్నాయి. డ్రెయినేజీ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఇళ్ల ఇళ్ల చుట్టే మురుగు పారుతోంది. ఫలితంగా దోమలు, ఈగలు ఆవాసం ఉంటూ వ్యాధులను కలుగజేస్తున్నాయి. కనీసం అంబులెన్స్ లో వైద్యసదుపాయం కూడా ఏర్పాటు చేయకపోవడం యజమాన్యానికి కార్మికుల పట్ల ఉన్న శ్రద్ధను సూచిస్తోంది.  


 



అక్కడి ప్రజలు కన్నీళ్ల పర్యాంతమవుతున్నారు. డి కార్మికులు.. వారి కుటుంబసభ్యులు వివిధ రకాల , వారి కుటుంబసభ్యులు వివిధ రకాల విషజ్వరాలతో విలవిల్లాడిపోతున్నా యాజమన్యం ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తోన్నాయి. 


 


సింగరేణి కార్మికులు అధికశాతం జీవనం సాగించే కాలనీల్లో విషజ్వరాలతో వణుకుతోంది. కేవలం కాలనీలను సందర్శించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. బొగ్గు ఉత్పత్తికి, రవాణాకు కొనుగోళ్లకు ఇచ్చిన ప్రాధాన్యత తమ ఆరోగ్యాలకు మాత్రం ఇవ్వడం లేదని కార్మికులు ఆరోపిస్తున్నారు.


Comments