పడకంటి మనసులో మాట


 


పడకంటి మనసులో మాట...


 


 


లాక్ డౌన్ వల్ల ఇబ్బందుల్లో పడిన ఏ ఒక్క వర్గానికి తక్షణ ఉపసమనం - కలుగుతుందన్న భరోసా దక్కడం లేదు. పేదలకు నేరుగా డబ్బులు వారి జేబుల్లో చేరేలా ప్యాకేజీ ఉండాలి. పేద వర్గాలు మోడీ ప్రకటనపై అవే ఆశలు పెట్టుకున్నాయి. అయితే విత్త మంత్రి ప్రకటన వడ్డీలకు రుణాలిచ్చే ఏజెన్సీ పాత్రను కేంద్రం పోషిస్తున్నదా అనిపించేలా ఉంది. . ప్రస్తుతం దేశంలోని ప్రతీ పేదోడికి డబ్బు అవసరం ఉంది. అది అందించకుండా ప్యాకేజీలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపేందుకే కేంద్రం పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.


 


______________________________


అరిచేతిలో స్వర్గం చూపేలా మాత్రమే కేంద్రం ప్యాకేజీ ఉంది



దేశం కల్లోలంలో ఉంది. నిజమే. ఒక వైపు శరవేగంగా విజృంభిస్తున్న కరోనా...మరో వైపు లాక్ డౌన్ కారణంగా కుదేలైన ఆర్థిక స్థితి. ఈ పరిస్థితుల్లో ప్రధాని నరేంద్రమోడీ సమయోచితంగానే నిర్ణయాలు తీసుకుంటూ వస్తున్నారు.


సడలింపులతో లాక్ డౌన్ పొడిగించడం, 20లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీ ప్రకటించి పేదలకు, లాక్ డౌన్ కారణంగా కుదేలైన పారిశ్రామిక, వ్యవసాయ రంగాలను ఆదుకుంటానడం అన్నీ మంచి చర్యలే.



అయితే లాక్ డౌన్ సడలింపుల విషయంలోనే మోడీ కేంద్ర ప్రభుత్వానికి ప్రజల క్షేమం ఎంత ముఖ్యమో... అంతకంటే దేశ ఆర్థిక పురోగతి ఎక్కువ ముఖ్యం అనేలా వ్యవహరించారు.


మద్యం దుకాణాలు తెరుచుకోవడానికి అనుమతి ఇవ్వడం, అదే సమయంలో ప్రభుత్వాలకు పెద్దగా ఆదాయాన్నివ్వని దేవాలయాలకు అనుమతి ఇవ్వకపోవడంపై పలు వర్గాల నుంచి విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమౌతున్నాయి.



 


మద్యం దుకాణాలు తెరుచుకోవడం తరువాయి...మందుబాబులు భౌతిక దూరం అనే మాటను పట్టించుకోకుండా దుకాణాల ముందు తోపులాటల వరకూ వెళ్లడం దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ కనిపించింది. ఇక ప్యాకేజీ విషయంలో కూడా కేంద్రం ప్రాధామ్యాలు ఒక వ్యాపారి ప్రాధామ్యాలుగానే ఉన్నాయి.


ప్రధాని మోడీ ప్రకటించిన ప్యాకేజీ వివరాలను రోజుకు కొన్ని చొప్పున విత్త మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తున్నారు. ఆ వివరాలను చూస్తుంటే లాక్ డౌన్ వల్ల ఇబ్బందుల్లో పడిన ఏ ఒక్క వర్గానికి తక్షణ ఉపసమనం కలుగుతుందన్న భరోసా దక్కడం లేదు. పేదలకు నేరుగా డబ్బులు వారి జేబుల్లో చేరేలా ప్యాకేజీ ఉండాలి.



పేద వర్గాలు మోడీ ప్రకటనపై అవే ఆశలు పెట్టుకున్నాయి. అయితే విత్త మంత్రి ప్రకటన వడ్డీలకు రుణాలిచ్చే ఏజెన్సీ పాత్రను కేంద్రం పోషిస్తున్నదా అనిపించేలా ఉంది. . ప్రస్తుతం దేశంలోని ప్రతీ పేదోడికి డబ్బు అవసరం ఉంది.


అది అందించకుండా ప్యాకేజీలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపేందుకే కేంద్రం పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న పేదలు, వలస కూలీలు, చితికిపోయిన వ్యాపారులు, చిన్న మధ్య తరహా పరిశ్రమల వారిని ఆదుకోవడం కంటే ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటున్న ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, రేటింగ్ సంస్థలిచ్చే రేటింగ్ పైకే కేంద్రం ఎక్కువ దృష్టి పెట్టినట్లు కనిపిస్తుంది.


 



ఇప్పటికైనా ప్యాకేజీల పేరుతో అంకెలను ఘనంగా వల్లెవేయడం కాకుండా రేపటి నుంచి నాలుగో విడత లాక్ డౌన్ మొదలు కానున్న నేపథ్యంలో వెసులు బాట్లు ఇచ్చేశాం, మీ బతుకు మీరు బతకండి అని పేదలను, వలస కూలీలను, చితికిపోయిన వర్గాలను గాలికి వదిలేయకుండా మోడీ చెప్పిన విధంగా జీడిపీలో పది శాతం సొమ్మఉ అవసరమైన వారి జేబుల్లోకి నేరుగా చేరేలా చర్యలు రూపొందించి అమలు చేయాల్సిన అవసరం ఉంది.


ఆ దిశగా ప్రధాని చర్యలు తీసుకుంటారని ఆశిద్దాం. కేజీ రూపంలో ప్రకటించారని ఇది సరికాదన్నారు. నగదు నేరుగా పేదలకు అందేలా చూడాలని మోడీజీ అంటూ కోరారు. ఉపాధిహామీ చట్టం కింద కనీసం 200 రోజుల పని కల్పించాలని, కూలీ రెట్టింపు చేయాలని, రైతులకు నగదు సేవ అందజేయాలని డిమాండ్ చేశారు.



వీరంతా భవిష్యత్తులో భారత్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్లేందుకు ఉపయోగపడుతారని వివరించారు. వడ్డీ వ్యాపారిలా నటించడం మానేయాలని కోరారు. వలస కూలీల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని, ప్రస్తుతం అత్యంత ఎక్కువ సమస్యలు వీరితో పాటు రైతులే ఎదుర్కొంటున్నారని తెలిపారు.


వారి సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పేదలకు ఆర్థిక సాయం చేయకుండా దేశంలో ఆర్థిక వ్యవస్థ ప్రారంభం కాదని చెప్పారు. వీరితో పాటు రైతులే ఎదుర్కొంటున్నారని తెలిపారు. వారి సమస్యలను పరిష్కరించాల్సిన ప్రారంభం కాదని చెప్పారు.


______________________________


సడలింపులతో కొత్త చిక్కులు కేసీఆర్ పునరాలోచించాలి



తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడి చర్యలలో దేశం మొత్తం ఔరా అనే విధంగా చర్యలు తీసుకుంది. లాక్ డౌన్ నిబంధనలను కఠినంగా అమలు చేస్తూనే, రైతులూ, పేద తరగలి వారూ ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకుంది.


రేషన్ పంపిణీ నుంచీ, కార్డు దారులకు నగదు బదలాయింపు వరకూ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులూ, లోటుపాట్లూ లేకుండా పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకుంది. అయితే మూడో విడత లా డౌన్ సడలింపుల విషయంలో కేంద్రం, పొరుగు రాష్ట్రాల తొందరపాటు నిర్ణయాల కారణంగా తెలంగాణకు కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.



ముఖ్యంగా మద్యం దుకాణాలను అనుమతి విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఇష్టం లేకపోయినా పొరుగు రాష్ట్రాలు మద్యం విక్రయాలను ప్రారంభించడంతో మద్యం స్మగ్లింగ్ ఆగాలంటే అనివార్యంగా రాష్ట్రంలోనూ వాటిని తెరవాల్సి వచ్చింది.


దాంతో రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో కరోనా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరగడం మొదలైంది. అదొక్కటే కాదు...వలస కూలీల విషయంలో కేంద్రం ప్రణాళికా రహితంగా వ్యవహరించడం, వెసుల బాట్ల పేరుతో వలస కూలీలను ఎలాంటి పరీక్షలూ, ఆంక్షలూ లేకుండా స్వస్థలాలను పంపాలని తీసుకున్న నిర్ణయంతో కూడా భాగ్యనగరంలో కరోనా కేసుల సంఖ్య పెరగడానికి కారణమైంది.



తెలంగాణలో మూడో విడత లాక్ డౌన్ సందర్భంగా ఇచ్చిన వెసులు బాట్లు, సడలింపుల కారణంగానే కరోనా వ్యాప్తి పెరిగింది. జప్పుడు రేపటి నుంచి నాలుగో విడత లాక్ డౌన్ మొదలు కానుంది. ఈ సందర్భంగా మరిన్ని సడలింపులు ఉంటాయని చెబుతున్నారు. పరిమితంగా ప్రజారవాణాకు కూడా పచ్చజెండా ఊపే అవకాశం ఉందంటున్నారు.



ఇప్పటి వరకూ కరోనా కట్టడిలో విజయవంతంగా ముందుకు వెళుతున్న తెలంగాణ రాష్ట్రంలో సడలింపుల పేరుతో పట్టు జారకుండా చర్యలు తీసుకోవాలి. సడలింపుల విషయంలో కేసీఆర్ పునరాలోచించాల్సిన అవసరం ఉంది.


కరోనాతో కలిసి జీవించాల్సిందే అంటఏ... కరోనాను ఆహ్వానించడం కాకూడదు. కట్టడికి చర్యల విషయంలో పట్టు సడలించకూడదు.


______________________________


మానవతా కోణంలో జగన్ ముందుకు



కరోనా కట్టడి విషయంలో ఇప్పటికే అన్ని చర్యలను పటిష్టంగా అమలు చేస్తున్న ఏపీ సీఎం జగన్ కంటైన్మెంట్ల నిర్వహణ, క్వారంటైన్ లలో సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు.


అలాగే జనరల్ మెడిసిన్ విషయంలో ఎవరూ ఇబ్బందులు పడకుండా టెలీ మెడిసిన్ విధానాన్ని రాష్ట్రంలో పక్కాగా అమలు చేస్తున్నారు. తెల్ల రేషన్ కార్డు దారులకు నాలుగు విడతలుగా ఉచిత రేషన్ అందించిన ఆయన వలస కూలీల విషయంలో ఉదారంగా వ్యవహరించడంపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తున్నదది.



రాష్ట్రం మీదుగా నడిచి వెళుతున్న వలస కూలీలకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించాలన్న ఆయన నిర్ణయం బహుదా ప్రశంసనీయం. మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


వలస కూలీల విషయంలో తొలి నుంచీ కూడా కేంద్రం సహా అన్ని రాష్ట్రాలు ప్రణాళిక లేకుండానే వ్యవహరించాయి. దాని ఫలితమే దేశంలో జాతీయ రహదారులపై ఎక్కడ చూసినా వందల సంఖ్యలో, వేల సంఖ్యలో కూలీల పాదయాత్రలు కనిపిస్తున్నాయి.



ఫలితమే రోడ్డు ప్రమాదాలు, ఇతర రూపాలలో మృత్యువుకు వారు బలౌతున్నారు. ఏపీ నుంచి వారి స్వస్థలాలకువెళ్లే వలస కార్మికులకు ఉచిత రవాణా కల్పించడమే కాకుండా దారి భత్యం కింద వారికి రూ.500లు ఇవ్వడం, కరోనా చికిత్స నుంచి కోలుకుని ఇళ్లకు వెళుతున్న వారికి పౌష్టికాహారం తినేందుకు వీలుగా రెండు వేల రూపాయలు ఇవ్వడం జగన్ లోని మానవతా దృక్పథానికి నిదర్శనం.


మిగిలిన రాష్ట్రాలు కూడా ఈ విధానాన్ని అనుసరించాల్సి ఉంది.


Comments