పడకంటి మనసులో మాట ...
________________________________________________________________
130 కోట్లపైగా జనాభా ఉన్న దేశంలో రోజుకు లక్షల సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తూ...పరీక్షలు అధికంగా చేయడం వల్లే కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం చెప్పడం బుకాయింపే అవుతుంది తప్ప మరొకటి కాదు. హెర్ట్ ఇమ్యూనిటీ, కేసులు అత్యధిక స్థాయికి చేరిన తరువాత వాటంతట అవే తగ్గుతాయి అన్న వాదన కూడా అసమంజసమే. ఈ వాదనకు కేంద్రం వత్తాసు పలకడం కరోనా కట్టడి విషయంలో కాడి వదిలేయడంగానే భావించాల్సి ఉంటుంది. ఇతర దేశాలతో పోలిస్తే మన జానాభా చాలా ఎక్కువ అది కచ్చితంగా కేసుల సంఖ్యపై, మహమ్మారి వ్యాప్తిపై ప్రభావం చూపుతుంది. అందుకని మిగిలిన దేశాల కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.
________________________________________________________________
కరోనా కట్టడికి చర్యలేవీ ? !
దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ పెరిగింది, కొన్నిచోట్ల సెకండ్ వేవ్ కూడా మొదలై పోయింది. ఇందుకు ప్రధాన క ఆరణం...కేంద్రం నిర్లిప్తత, నిర్లక్ష్యం, క్రియాశూన్యతేనని మేధావులు విమర్శిస్తున్నారు. ఎవరిదాకాలో ఎందుకు దేశంలో కరోనా విజృంభణకు కారణాలను ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా ఒక ఇంటర్యూలో చెప్పిన మాటలే కేందం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదనడానికి నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తాయి.
కరోనా వ్యాపించిన తొలినాళ్లలో తీసుకున్నంతగా ప్రజలు ఇపðడు జాగ్రత్తలు తీసుకోవడం లేదని, ఢిల్లీలో కొంతమంది మాస్కులు లేకుండానే బయట సంచరిస్తున్నారని ఆయన కుండ బద్దలు కొట్టారు.ఇందుకు కారణం ప్రజలలో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రతకు సంబంధించి ప్రజలలో చైతన్యం తీసుకు వచ్చేంతగా ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని చెప్పాల్సి ఉంటుంది.
పైగా కరోనాకు మనిషిని చంపే శక్తి లేదు...వ్యాక్సిన్ వచ్చే వరకూ మహమ్మారితో సహజీవనం తప్పదని కేంద్రం పెద్దలు చేస్తున్న ప్రకటనలు జనంలో నిర్లక్ష్యానికి కారణం అవుతున్నాయి. కరోనా వ్యాప్తి తీవ్రత, మహమ్మారి సోకితే ఆరోగ్యం గుల్ల అవుతుందని, కోలుకున్నా కూడా ఆరోగ్యం దెబ్బతింటుందనీ ప్రపంచ ఆరోగ్య సంస్థ సహా వైద్య నిపుణులు చెబుతుంటే...ప్రభుత్వం మాత్రం రికవరీ రేటు పెరుగుతోందని ఘనంగా చాటుతూ...వరుస అన్ లాక లతో జనం స్వేయ స్వేచ్ఛగా తిరిగేందుకు దోహదం చేస్తున్నది.
ప్రభుత్వాల వైఖరి కారణంగానే జనం గుంపులు గుంపులుగా ఞక చోట చేరడానికి వెనుకాడటం లేదు. కరోనా వ్యాప్తికి ముందున్న విధంగానే భారీ ఎత్తున ఢిల్లీ, ముంబై వంటి నగరాలలో ట్రాఫిక జామ్ అవుతోంది.. పార్టీలు, వేడుకలకు కోవిబ్ నిబంధనలను పట్టించుకోకుండా పెద్ద సంంఖ్యలో జనం హాజరౌతున్నారు.
దాని ఫలితమే చిన్న చిన్న పట్టణాలు, గ్రావిూణ ప్రాంతాల్లో కూడా మహమ్మారి విస్తరణ తీవ్రంగా ఉంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే...దేశంలో కరోనా కట్టడి అన్నది నీటి మీద రాతలాగే మిగిలిపోతుందని మేధావులూ, వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అయితే దేశంలో కరోనా నిర్దారణ పరీక్షల సామర్థ్యం పెరిగిందని, కాబట్టే కేసుల సంఖ్య పెరుగుతుందన్న వాదన ఉంది. అయితే 130 కోట్లపైగా జనాభా ఉన్న దేశంలో రోజుకు లక్షల సంఖ్యలో కరోనా పరీక్షలు నిర్వహిస్తూ...పరీక్షలు అధికంగా చేయడం వల్లే కేసులు పెరుగుతున్నాయని ప్రభుత్వం చెప్పడం బుకాయింపే అవుతుంది తప్ప మరొకటి కాదు.
హెర్ట్ ఇమ్యూనిటీ, కేసులు అత్యధిక స్థాయికి చేరిన తరువాత వాటంతట అవే తగ్గుతాయి అన్న వాదన కూడా అసమంజసమే. ఈ వాదనకు కేంద్రం వత్తాసు పలకడం కరోనా కట్టడి విషయంలో కాడి వదిలేయడంగానే భావించాల్సి ఉంటుంది. ఇతర దేశాలతో పోలిస్తే మన జానాభా చాలా ఎక్కువ అది కచ్చితంగా కేసుల సంఖ్యపై, మహమ్మారి వ్యాప్తిపై ప్రభావం చూపుతుంది.
అందుకని మిగిలిన దేశాల కంటే ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది. కోవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌లో కీలక సభ్యుడిగా ఉన్న డాక్టర్ గులేరియా ఇపðడు చాలా దేశాల్లో కరోనా నిరోధక వ్యాక్సిన్ ప్రయోగాలు మొదలయ్యాయి.
భారత్ నుంచే 3 వ్యాక్సిన్లు రాబోతున్నాయి అని చెబుతూనే ఇప్పటి వరకూ అయితే ఏ వ్యాక్సిన్ కూడా ప్రయోగ స్థాయి దాటలేదనీ, జాగ్రత్తలుతీసుకోవడం ఒక్కటే మహమ్మారి వ్యాప్తి విస్తరణ తీవ్రతను నియంత్రించేందుకు మార్గమని కుండబద్దలు కొట్టేశారు. అంటే అన్ లాక 4 ద్వారా ప్రజా రవాణాకు కేంద్రం పచ్చ జెండా ఊపడమంటే...మహమ్మారి వ్యాప్తికి తలుపులు బార్లా తెరవడమేనని ఆయన చెప్పకనే చెప్పేశారు.
రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక వీ గురించి, అది చాలా ప్రభావమంతంగా పని చేస్తున్నదంటూ మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వస్తున్నాయి. కానీ వాస్తవం లాన్సెట్‌లో ప్రచురించిన కథనం తేటతెల్లం చేసింది. స్పుత్నిక శాంపిల్ సైజ్ చాలా తక్కువ అనీ, చాలా తక్కువ మందిపై మాత్రమే ప్రయోగాలు జరిపారనీ, సైడ్ ఎఫెక్ట ఉంటాయని ఆ కథనం సారాంశం.
అలాగే ప్రపంచ దేశాలలో వివిధ దశల్లో ఉన్న ఏ వ్యాక్సిన్ ప్రయోగాలూ కూడా ఇంకా మూడో దశ క్లినికల్ ట్రయల్ దశ దాటలేదు. వైద్య రంగ నిపుణుల ప్రకారం మూడో దశ క్లినికల్ ట్రయల్స్ చాలా సుదీర్ఘ ప్రక్రియ. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయితే వచ్చే ఏడాదిరెండో అర్థ భాగం వరకూ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు.
వీటన్నిటినీ పరిగణనలోనికి తీసుకుని కేంద్రం ఇప్పటికైనా ప్రజారోగ్య రక్షణ కంటే...ఆర్థిక ఒడిదుడుకులు, రేటింగ్స్, అంతర్జాతీయ విఫణిలో పోటీ ఏమంత ముఖ్యం కాదని తెలుసుకోవాలి. ్ట మూడో దశ ట్రయల్స్ పూర్తి చేసుకుంటేనే గానీ కోవిడ్‌ను అంతం చేయగల టీకా అందుబాటులోకి వచ్చే విషయం గురించి ఓ అవగాహనకు రాలేము. ఇందుకు ఇంకా కొన్ని నెలల సమయం పట్టవచ్చు.
అంతా సాఫీగా జరిగి, ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్ వస్తే బాగుంటుంది. కానీ వ్యాక్సిన్ వచ్చిందనగానే...కరోనాను తుదముట్టించేశామని భావించడానికి వీల్లేదు. ౠ వ్యాక్సిన్ ను 130 కోట్ల మంది జనాభాకు ఇవ్వాలి. అందుకు ఎంత కాలం పడుతుంది. ప్రాదాన్యతా క్రమం మేరకు కోవిడ్ వారియర్స్‌కు ముందుగా వ్యాక్సిన్ ఇస్తారు.
ఆ తరువాత మిగిలిన వారికి. ఇదంతా జరగడానికి ఎంత కాలం పడుతుందన్న అంచనా కేంద్రం వద్ద ఉందా అన్నది సందేహమే. తొలి రోజుల్లో కోవిడ్ లాక డౌన్ ప్రకటిస్తున్న సందర్భంగా ప్రజల ప్రాణాల కంటే తమ ప్రభుత్వానికి ఏదీ ముఖ్యం కాదని ప్రకటించారు.
కానీ నెలల వ్యవధిలోనే...ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి మించిన ప్రాధాన్యత తమ ప్రభుత్వానికి మరొటే లేదని చాటేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికైనా కేంద్రం సమాఖ్య స్ఫూర్తికి అనుగుణంగా కరోనా కష్టాలనుంచి తేరుకోవడానికి రాష్ట్రాలకు, ప్రజలకుఆర్థిక చేయూతనిచ్చేలా చర్యలుతీసుకుని మహమ్మారి కట్టడికి కఠిన చర్యలు తీసుకోవాలి.
________________________________________________________________
సర్వమత సమానత్వమే కేసీఆర్ అజెండా
కొత్తగా నిర్మించే సెక్రటేరియట్‌లో మందిరం, మసీదులు, చర్చిని పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు వెల్లడించడం ముదావహం. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత గంగా జమునా తహజీబ్‌కు అద్దం పట్టేలా ఒకే రోజు అన్ని ప్రార్థనా మందిరాలకు శంకుస్థాపన చేసి, త్వరితగతిన నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన మత పెద్దలతో సమావేశంలో చెప్పడం ద్వారా...రాష్ట్రంలో మత సామరస్యం, సమానత్వం కోసం తాను కంకణం కట్టుకున్నానని చాటారు.
పాత సచివాలయం కూల్చివేత సమయంలో పొరపాటున అక్కడ ఉన్న మసీదు, మందిరం ధ్వంసమయ్యాయి. దీనిపై విపక్షాలు నానా రభసా చేశాయి. రాద్ధాంతం సృష్టించాయి.
సున్నితమైన అంశంలో సంయమనం పాటించాలన్న పరిణితిని ప్రదర్శించడంలో విఫలమయ్యాయి.అయితే ప్రభుత్వాధినేతగా కేసీఆర్ చక్కటి సంయమనం పాటించి...ప్రజల మనోభావాలకు గౌరవం ఇస్తూ ఆనాడే...ప్రభుత్వ వ్యయంతో అదే చోట మందిరం, మసీదు నిర్మించి తీరుతామని ప్రకటించి పరిస్థితి అదుపుతప్పకుండా చర్యలు తీసుకున్నారు.
అయితే తాను ఆనాడు అన్న మాట ఓటి మాట కాదనీ, అమలు చేసి తీరతానని కంకణం కట్టుకుని ఇచ్చిన వాగ్దానమనీ, మత పెద్దలతో సమావేశంలో స్పష్టం చేశారు. 750 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఇమామ్ క్వార్టర్‌తో సహా రెండు మసీదులు ప్రభుత్వం నిర్మిస్తుంది.
పాత సెక్రటేరియట్ లో ఉన్న స్థలంలోనే మసీదుల నిర్మాణం జరుగుతుంది. నిర్మాణం పూర్తయిన తర్వాత మసీదులను వక్ఫ బోర్డుకు అప్పగిస్తుంది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణంలో మందిరం నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతుంది. నిర్మాణం పూర్తయ్యాక దేవాదాయ శాఖకు మందిరాన్ని అప్పగిస్తుంది.
కొత్త సెక్రటేరియట్ ప్రాంతంలో తమకు కూడా ప్రార్థనా మందిరం కావాలన్న క్రిస్టియన్ల కోరిక మేరకు చర్చిని కూడా ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇది కేసీఆర్ మత పెద్దలకు ఇచ్చిన వాగ్దానం. తెలంగాణ రాష్ట్రం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తుందని కేసీఆర్ ఈ వాగ్దానం ద్వారా విస్పష్టంగా చాటారు.
గంగా జమునా తహజీబ్‌కు ప్రతీకగా కొత్త సెక్రటేరియట్‌లో అన్ని మతాల ప్రార్థనా మందిరాలు నిర్మించడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉండటం అన్ని వర్గాల వారి ప్రశంసలనూ చూరగొంటున్నది. ఇప్పటికే కుల, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారి సంక్షేమానికీ పలు కార్యమ్రాలను చేపట్టిన కేసీఆర్ సర్కార్...ఇప్పుడు కొత్త సచివాలయాన్ని సర్వమత సమానాత్వానికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దడానికి సంకల్పించడం దేశంలో మత సామరస్యానికి దోహదపడుతుందనడంలో సందేహం లేదు.
రాష్ట్రంలో తెలుగు భాషకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న కేసీఆర్, ఉర్దూ భాష పరిరక్షణకూ అంతే చిత్తశుద్ధితో నిర్ణయాలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో ఉర్దూను రెండవ అధికార భాషగా గుర్తించిన ఘనత కేసీఆర్ సర్కార్‌దే.
ఉర్ధూ భాష పరిరక్షణ, అభివృద్ధి కోసం అధికార భాష సంఘంలో ఉర్దూ భాషాభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది అధికార భాష సంఘంలో ఉర్దూ భాషకు సంబంధించిన వ్యక్తిని ఉపాధ్యక్షులుగా నియమించనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
అంతర్జాతీయ ప్రమాణాలతో హైదరాబాద్ నగరంలో ఇస్లామిక సెంటర్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించి స్థలం కూడా కేటాయించింది. అయితే కరోనా పరిస్థితుల వల్ల నిర్మాణంలో జాప్యం జరుగుతున్నది. వెంటనే ఈ సెంటర్ నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు.
ఇక నారాయణపేటలో రోడ్ల వెడల్పు కార్యక్రమం సందర్భంగా పీరీల చావడి అయిన అసుర్ ఖానాకు నష్టం వాటిల్లింది. దీనికి కూడా సువిశాల స్థలం కేటాయించి, నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినట్లు ప్రకటించారు.
________________________________________________________________
రైతుశ్రేయస్సుకోసం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నైపుణ్యాభివృద్ధి కోసం కాలేజీలు ఏర్పాటు చేసి వాటిలో ప్రత్యేక కోర్సులు నిర్వహించాలని ఏపీ సర్కార్ నిర్ణయించింది. రైతు శ్రేయస్సే లక్ష్యంగా ఫుడ్ ప్రాసెసింగ్‌లో పెద్ద కంపెనీలతో అనుసంధానం కావడం ద్వారా రైతు ఉత్పత్తులకు మార్కెటింగ్ సమస్యలు రాకుండా అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో మహిళా గ్రూపులను ప్రోత్సహించాలని భావిస్తున్నది.
వ్యవసాయ ఉత్పత్తులు, మహిళా గ్రూపులకు ప్రోత్సాహం అన్న ఏకైక అజెండాలో జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబుల్లో అంతర్భాగంగా ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు కంకణం కట్టుకుంది.
రైతులు తరచుగా ఇబ్బందులు పడుతున్న 7, 8 రకాల ప్రధాన పంటలకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ చేయాలని, ఆ ప్రాసెసింగ్ సెంటర్లలో అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిం చుకోవాలని సీఎం వైఎస్ నిర్ణయించారు.
రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోనూ వెనుకాడబోదనీ, రైతుల శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఎంత వ్యయమైనా వెనుకడుగు వేయబోననీ, జగన్ రాష్ట్ర ముఖ్య మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే ప్రకటించారు. నాటి నుంచి ఆయన రైతాంగం శ్రేయస్సు కోసం ఒకటి తర్వాత ఒకటిగా పథకాలు చేపడుతూనే ఉన్నారు.
ఆక్వా రంగం రైతులకూ మేలు జరగాలని, వారి ఉత్పత్తులకు తగిన ధరలు లభించాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే ఫుడ్ ప్రాసెసింగ్‌పై నెదర్లాండ్ ప్రభుత్వం సహా 8 కంపెనీలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందాలు చేసుకుంది. వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, మార్కెటింగ్, టెక్నాలజీపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది.
అరటి, టవెూటా, మామిడి, చీనీ, మిర్చి, కూరగాయలు సహా పలు వ్యవసాయ ఉత్పత్తులు, ఆక్వా ఉత్పత్తుల ఫుడ్ ప్రాసెసింగ్‌పై పలు కంపెనీలతో ఇప్పటికే అవగాహనా ఒప్పందాలు(ఎంవోయూలు) చేసుకుంది. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో నూతన టెక్నాలజీ, కొత్త ఉత్పత్తుల తయారీపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌వెూహన్‌రెడ ఆయా కంపెనీల ప్రతినిథులతో అవకాశం దొరికినప్పుడల్లా చర్చలు జరుపుతున్నారు.
పంట చేతికి వచ్చిన తర్వాత అనుసరించాల్సిన విధానాలు, అందులో టెక్నాలజీ అంశాలపై విస్తృతంగా చర్చలు జరుపుతున్నారు. అరటి సహా పండ్లు, కూరగాయల ఫుడ్ ప్రాసెసింగ్‌పై పుణెకు చెందిన ఫ్యూచర్‌టెక ఫుడ్స్ పైవేట్ లిమిటెడ్‌తో ఒప్పందం కుదిరింది.
సాంకేతిక పరిజ్ఞానంపై సీఎం వైఎస్ జగన్ కంపెనీ సీఈఓ అజిత్ సోమన్‌తో చర్చిచారు.
వ్యాక్యూమ్ టెక్నాలజీ ఉపయోగాలను తెలుసుకున్నారు.రైతు ప్రయోజనాలకు దోహదపడే ఏ ఒక్క అంశంలోనూ రాజీలేదని విస్పష్టంగా చాటిన సీఎం జగన్ పంటల వారీగా ఫుడ్ ప్రాసెసింగ్ టెక్నాలజీపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగానే ప్రముఖ, ప్రసిద్ధ కంపెనీలతో ఒప్పందాలకు ముందుకు వస్తున్నారు.
________________________________________________________________
For more updates:
Follow us on Facebook
Join our Facebook group
News 9 Telugu Daily Public Group
Follow us on Instagram: