పడకంటి మనసులో మాట 25.10.2020


పడకంటి మనసులో మాట...


_______________________________________________________________


నిబద్ద రాజకీయాలు నడుపుతామన్న బిజెపి పాలకులు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం సామాన్యులను సైతం కలవరానికి గురిచేసేలా ఉంది. కరోనా టీకాను దేశప్రజలందరికి అందించే యత్నాల్లో ఉన్నామని అప్పట్లో ప్రధాని వెూడీ ప్రకటించారు. వ్యాక్సిన్‌ ప్రయోగద శలో ఉండగా బీహార్‌ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టో చూస్తే ప్రజల్లో ఓ రకమైన భయం ఆవరించేలా కనిపించింది.రేపు వ్యాక్సిన్‌ వచ్చినా మనకు దక్కుతుందా అన్న భయం సామాన్యులకు కలిగేలా బిజెపి ప్రవర్తించింది. నిజానికి బీహార్‌ లో ఇంతకాలం అధికారంలో ఉన్నదే వారు. అక్కడ ఏం ఘనకార్యాలు చేశారో వెల్లడించకుండా కరోనాను బీహార్‌ రాజకీయాల్లోకి లాగడం ద్వారా బిజెపి తన కుత్సిత బుద్దిని బయట పెట్టుకుంది.


_______________________________________________________________


కరోనాతోనూ రాజకీయమేనా?


 



రానురాను బిజెపి రాజకీయాలు రోత పుట్టిస్తున్నాయి. ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన కేంద్రం తీరు మరీ అధ్వాన్నంగా తయారయ్యింది. కరోనా వేళ అంతా ఆందోళనలో ఉంటే బిజెపి మాత్రం రాజకీయాలు చేస్తోంది. మిగతా పార్టీలు ఎలా చేసినా ఫర్వాలేదు... కానీ అధికారంలో ఉన్న పార్టీ కరోనాపై రాజకీయాలు నడపడమే అసహ్యం కలిగిస్తోంది.


బీహార్‌లో అధికారం కోసం కరోనా ఉచితహావిూ ఇవ్వడం దారుణమైన విషయంగా గుర్తించాలి. నిబద్ద రాజకీయాలు నడుపుతామన్న బిజెపి పాలకులు ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయడం సామాన్యులను సైతం కలవరానికి గురిచేసేలా ఉంది. కరోనా టీకాను దేశప్రజలందరికి అందించే యత్నాల్లో ఉన్నామని అప్పట్లో ప్రధాని వెూడీ ప్రకటించారు.



వ్యాక్సిన్‌ ప్రయోగద శలో ఉండగా బీహార్‌ ఎన్నికల సందర్భంగా ప్రకటించిన మ్యానిఫెస్టో చూస్తే ప్రజల్లో ఓ రకమైన భయం ఆవరించేలా కనిపించింది. రేపు వ్యాక్సిన్‌ వచ్చినా మనకు దక్కుతుందా అన్న భయం సామాన్యులకు కలిగేలా బిజెపి ప్రవర్తించింది. నిజానికి బీహార్‌ లో ఇంతకాలం అధికారంలో ఉన్నదే వారు.


అక్కడ ఏం ఘనకార్యాలు చేశారో వెల్లడించకుండా కరోనాను బీహార్‌ రాజకీయాల్లోకి లాగడం ద్వారా బిజెపి తన కుత్సిత బుద్దిని బయట పెట్టుకుంది. ఇక బిజెపి కన్నా తమిళనాడు సర్కార్‌ నయం. ఇంకా ఎన్నికలకు సమయం ఉంది. అయినా తమ రాష్ట్రంలో ఉచితంగా కరోనా వ్యాక్సిన్‌ ప్రజలందరికి ఇస్తామని ప్రకటించారు.



కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే రాష్ట్రం లోని ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తామని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ప్రకటించారు. అందుకయ్యే ఖర్చును పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని అన్నారు. కరోనా ప్రభావం ప్రజలను భయాందోళ నకు గురిచేసిందని, వేల సంఖ్యలో పాజిటివ్‌కు గురికాగా, మరెందరో ప్రాణాలు కూడా కోల్పోయారని అన్నారు.


వైరస్‌ మహమ్మారి పూర్తిగా నశించిపోయే వరకు అహర్నిశలు పాటుపడతామని, కరోనా సోకకుండా వ్యాక్సిన్‌పై ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఈ ఏడాది చివర్లోగా వ్యాక్సిన్‌ మార్కెట్‌లో విడుదల అవుతుందని ఆశిస్తున్నామన్నారు.



ఆశుభ ఘడియ రాగానే ప్రభుత్వమే పూర్తి ఖర్చును భరించి రాష్ట్ర ప్రజలందరికీ పూర్తి ఉచితంగా వ్యాక్సిన్‌ వేస్తామని పళనిస్వామి చెప్పారు. బీహార్‌ ప్రకటన...ఆ వెంటనే తమిళనాడు సిఎం ప్రకటన చూస్తుంటే కేంద్రం కరోనా ఖర్చులను, బాధ్యతలను రాష్ట్రాలపై రుద్దాలని చూస్తున్నట్లుగా ఉంది.


ఏ రాష్ట్రం ఖర్చు ఆ రాస్ట మే భరించాలన్న ఓ సంకేతాన్ని బిజెపి ఇస్తుందా అన్న అనుమానాలు కూడా వస్తున్నాయి. దేశ ప్రజలందరికీ కరోనాను ఉచితంగా అందిస్తామని చెప్పి ఉంటే బాగుండేది. కరోనాతో దేశం అల్లకల్లోలంగా మారింది. ప్రజల ప్రాణాలు పోతున్నాయి.



జీవనోపాధి గంగలో కలిసింది. ఈ దశలో దేశం భవితవ్యం ఏమి కానున్నదో అని ఆందోళన పడుతున్న వేళ బిజెపి ఎన్నికల ప్రచారం కోసం చేసిన కరోనా ఉచిత ప్రకటన సహజంగానే ఆందోళన కలిగిస్తోంది. కరోనా కన్నా..బిజెపి తీరే ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచానికంతటికీ మహమ్మారిగా మారి, ఎనిమిది నెలల నుంచి వేధిస్తున్న ప్రాణాంతక వైరస్‌కు లభించబోయే వ్యాక్సిన్‌ను ఓటర్లకు ఒక తాయిలం లాగా భారతీయ జనతాపార్టీ ఇవ్వజూపడం అన్నది క్షమించరాని నేరంగానే చూడాలి.


దేశ ప్రజలకు భరోసా ఇవ్వలేని పాలకులు మనలను ఏలుతున్నారని గమనించాలి. బిజెపి బీహార్‌ ఎన్నికల మ్యానిఫెస్టో చూశాక దేశమంతా ఆశ్చర్యపోయి ఉంటుంది. ఉచిత టీకా వాగ్దానం గురించి వినగానే, అనేక ప్రశ్నలు ముందుకు రావడం సహజం. బిజెపి కూటమికి ఓటు వేస్తేనే బిహార్‌ ప్రజలకు ఉచిత వ్యాక్సిన్‌ అందిస్తే..మరి ఎన్నికలు లేని మిగతా దేశ పరిస్థితి ఏంటన్న ప్రశ్న ఉదయిస్తోంది.


ప్రధాని గతంలో చఏసిన ప్రకటన ఆధారంగా పరిశీలిస్తే..దేశమంతటికీ ఉచితంగానే టీకా ఇచ్చేట్టయితే, బిహార్‌కు అది ప్రత్యేకమైన అంశంగా ఎందుకు మారిందన్నది ప్రశ్న. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి దిగజారిన రాజకీయాలకు కారణంగా మారడం ఆశ్చర్యంగా ఉంది.


ఒక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఇంతగా దిగజారాల్సిన అసవరం ఉందా అన్నది ప్రజలు ఆలోచన చేయాలి. బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ ప్రభుత్వం ప్రజల కోసం బాగా పని చేసి ఉంటే ..వారు తమ పనులను చెపð కోవాలి తప్ప మరోటి కాదు.కొవిడ్‌ టీకాను కూడా సార్వజనీన టీకా కార్యక్రమంలో భాగంగా చేసి ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని గతంలో చెప్పిన ప్రధాని.. ఇపðడిలా మాట మార్చి చెప్పించడం సిగ్గు చేటుగా భావించాలి.


నిజంగా ఇలా ప్రకటన చేసినందుకు జాతికి క్షమాపణలు చెప్పాలి. ఈ దేశ ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రధాని వెూడీ దిగజారుడు రాజకీయాలను ప్రోత్సహించడం దారుణం కాక మరోటి కాదు. మరోవైపు తమ ప్రకటనను బిజెపి నేతలు సమర్థించుకోవడం మరింత దారుణం.


కరోనా వ్యాక్సిన్‌ కోసం దేశ ప్రజలందరికి అందించాలంటే 59 వేల కోట్లు అవసరమవు తుందన్న అంచనాలు ఇటీవల వినిపించాయి. టీకా ప్రయోగ దశలో ఉందని, అది విజయం కావాలని ఆకాంక్షిస్తున్నామని చెప్పిన బిజెపి నాయకులు ఇవాళ రాజకీయ ప్రయోగంగా మార్చిన తీరుతో ప్రజల్లో నమ్మకం సడలింది.



ఇకపోతే ప్రధాని ఎన్నికల ప్రచారంలో కూడా హుందాతనం కనిపించలేదు. కనీసం తన ప్రంగంలో అయినా దేశ ప్రజలందరికీ ఉచితంగానే టీకా అందిస్తామని చెప్పవుంటే ప్రజలు సంతోషించే వారు. బీహార్‌ సైనికుల త్యాగాలను ప్రస్తుతించడం మంచిదే అయినా..దేశంలో అన్ని ప్రాంతాల వారు సైన్యంలో ఉండి పోరాడుతున్నారన్న కనీస పరిజ్ఞానం ప్రధాని మరిచారు.


గత ఐదేళ్లుగా బీహార్‌లో నితీశ్‌ కుమార్‌ రాజ్యమేలుతున్నారు. ఆయన ఎంత బాగా చేశారో అన్నది ప్రజలు తేల్చబోతున్నారు. కనీసం ఇప్పటికైనా బిజెపి వివరణ ఇచ్చి దేశప్రజలకు కరోనాపై ఉన్న అనుమానాలను, భయాలను తొలగించాలి. ప్రజలకు ఎలాగూ బతికే ధైర్యం ఇవ్వలేకపోయారు.


కనీసం టీకా ఉచితంగానే అన్న భరోసా ఇచ్చి పరువు కాపాడకుంటే బిజెపికే మంచిది.


_______________________________________________________________


వరద పరిస్థితుల్లోనూగత పాలకులపైవిమర్శలేనా?


 



 


హైదరాబాద్‌లో వందలాది కాలనీలు నీట మునిగి..ఇంకా నీటిలోనే తేలియాడు తున్నా.. ఒక్కో కుటుంబానికి కనీసం ఓ రెండు లక్షల వరకు నష్టం జరిగినా వారిని పట్టుకుని ఓదార్చే పాలకనాధుడు లేడు. విూకెందుకు మేమున్నామన్న బరోసా లేదు. వరదల్లో సర్వం కోల్పోయిన వారికి పదివేలతో నగరంలో షో చేస్తున్నారు.


ఇందులోనూ రాజకీయాలు కనిపిస్తున్నాయి. పాతబస్తీ జలదిగ్బంధంలోనే కొనసాగుతోంది. ప్రధానంగా లోతట్టు కాలనీల్లో ముంపు కష్టాలు వీడటం లేదు. సరూర్‌నగర్‌లోని పలు కాలనీలు ఇంకా వరద గుప్పిట్లోనే కొనసాగుతున్నాయి. తగ్గిందనుకునే లోపే మళ్లీ వర్షాలు కురుస్తుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.



ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారు. తమను ఆదుకునే వారు లేరా.. అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవన్నీ కంటికి కనిపిస్తున్న దృశ్యాలు. టీవీలు రోజూ గొంతెత్తి అరుస్తూ విజువల్స్‌ చూపిస్తు న్నారు. అలా చూపిన వారిలో కనీసం ఒక్కరినైనా కార్పోరేటర్లు, మంత్రులు పలకరించి బాధలను తొలగి స్తామని చెప్పలేక పోయారు.


నిజంగా మన దౌర్భాగ్యం కాకపోతే అల్పులను ఎన్నుకుంటే ఎంతగా అనర్థాల కు గురి కావాలో బాధితులకు తెలిసివచ్చింది. రైతులను గురించి పట్టించుకునే వారు లేరు. వారి ధాన్యం గురించి చింతచేయడం లేదు. ఆదుకుంటామన్న హావిూ ఇవ్వడం లేదు. నిండా మునిగిన వారిని కష్టాల నుంచి గట్టెక్కించే చర్యల గురించి ఆలోచన చేసి ఉంటే పరిస్థితి ఇంత దారుణంగా ఉండదు.



పండగల వేళ కొందరు ప్రజలు నీటమునిగి...ఇళ్లలోంచి బయటకు రాకుంటే ఎలా అన్న ఆలోచన చేసివుంటే ఇవాళ వారికి ఊరట దక్కేది. అధికార పార్టీ అలా చేయలేదు. సరికాదా..గత పాలకులపై విమర్శలకే పరిమితమైంది. ఇప్పటికే కురిసిన వర్షాలు భాగ్యనగర వాసుల జీవితాన్ని అల్లకల్లోలానికి గురిచేసాయి.


జోరు వానలతో వరదనీరు వచ్చి చేరుతోంది. వర్షం కారణంగా పురాతన ఇళ్లు గోడలు కూలుతున్నాయి. నగరంలో పురాతన భవనాలను గుర్తించి వాటిని కూల్చివేస్తున్నారు. చెరువులు, కుంటలను కబ్జా చేసి ఇళ్లు నిర్మించుకోవటం.. నాలాల ఆక్రమణె వరద ముంపునకు కారణమని ప్రధాన కారణమని నగరవాసులు అభిప్రాయపడుతున్నారు.



అందుకే కాలనీల్లో నాలాలు పొంగిపొర్లుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. తమ ఇళ్లు, ఆస్తులకు పెద్ద ఎత్తున నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న నాలాలు ఇపðడున్న జనాభాకు అనుగుణంగా లేవని తెలిపారు. వాటిని వెడల్పు చేయడం, పూడిక తీయడం, సామర్థం పెంపుతో పాటు నాలాల ఆక్రమణలు, చెరువుల కబ్జాను అరికట్టడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతున్నారు.


నాలాల ఆక్రమణల వల్ల వరద ముంపునకు గురైన ఆస్తి, ప్రాణనష్టం జరుగుతుందని కాలనీ వాసులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలాల ఆక్రమణలపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. భారీ వర్షాల కారణంతో 185 చెరువులు పూర్తిస్థాయిలో నిండగా,53 చెరువులు దెబ్బతిన్నాయి.



ముందుగా వరద నీరు తొలగించాలని నగరంలోని పలుకాలనీ వాసులు కోరుతున్నారు. మరోవైపు మూసీ నది మహోగ్ర రూపం దాల్చి అనేక ప్రాంతాలపై విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. హైదరాబాద్‌ చరిత్రలో రెండో అతి పెద్ద వాన కాగా,1908 తర్వాత హైదరాబాద్‌ నగరంలో తొలిసారి ఇంత భారీస్థాయిలో వర్షం పడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం.


పెద్ద ఎత్తున ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ ఎత్తున పంట నష్టం జరిగింది. సుమారు 70 మంది ప్రజలు వరదల కారణంగా మృతి చెందారు. 37 వేల కుటుంబాలు ముంపు బారిన పడ్డాయి. ఎపిలోనూ అనేక జిల్లాలు వరదగుప్పిట్లో ఉన్నాయి.



ఎక్కడక్కడే అనేక గ్రామాలు ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్నాయి. లక్షల మంది జనం తీవ్రంగా ప్రభావితమయ్యారని అంచనా. ఇళ్లు నీటమునిగి, బట్టలు, తిండి గింజ లు కొట్టుకుపోయి నష్టపోయారు. ఈ ఆపద సమయంలో అండగా ఉండాల్సిన ప్రభుత్వం మొత్తం గాలికి వదిలేసింది.


అసలు కష్టమే లేదన్నట్టు ఉదాశీనంగా వ్యవహరిస్తోంది. దీం నిత్యావసరాలు, అత్యవసరాలు తీర్చుకోవడానికి పట్టణాల్లో పడవల్లో తిరుగుతున్నారు. బాధితులు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వీరికి ఆహార సామగ్రి, భోజనం ప్యాకెట్లు అందించాల్సిన అధికారులు అదేదీ పట్టించుకోలేదు.



ఎమ్మెల్యే, కలెక్టర్‌, మంత్రులు కనీసం పరామర్శకు వెళ్లకపోవడంతో జనం మండిపడుతున్నారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో పండగ వేళ వారిని ఓదార్చే వారు కరువయ్యారు. ఇంతటి విషాదం నెలకొన్న వేళ యుద్దప్రాతిపదికన చర్యలకు దిగి ఉంటే సమస్యలు తగ్గకున్నా స్వాంతన కలిగేది.


_______________________________________________________________


పోలవరానికి ఈ పరిస్థితి జగన్‌ పాపమే!


 



దార్శనికత లేకపోవడం, రాజకీయ ప్రయోజనాల ముందు మరేమీ ముఖ్యం కావనుకోవడం రాజకీయాలలో సహజమే అయినా...మొత్తం రాష్ట్ర భవిష్యత్‌ ను అంధకారం చేసేలా రాజకీయ క్రీడకు తెరలేపే విక త క్రీడకు ఏపీలో జగన్‌ శ్రీకారం చుట్టారు.


ఆ ఫలితం ఇప్పుడు పోలవరం పై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పోలవరం నిర్మాణం విషయంలో అడుగు ముందుకూ పడక, వెనక్కు వేయడానికి అవకాశం లేక రాష్ట్ర ప్రభుత్వం గిజగిజలాడుతోంది. పిల్లి తగవు, పిల్లి తగవు పిట్ట తీర్చిన చందంగా ఇప్పుడు కేంద్రం వ్యవహరిస్తున్నది.



తన చేతికి మట్టి అంటకుండా...తనకు ప్రాబల్యం లేని రాష్ట్రం అన్ని విధాలుగా దిగజారిపోవడాన్ని చోద్యం చూస్తున్నట్లుగా చూస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే...ఆంధ్రప్రదేశ్‌ కు జీవనాడి వంటి పోలవరం నిర్మాణం రాష్ట్ర పునర్విభజన సందర్భంగా అప్పటి యూపీఏ ప్రభుత్వం ఏపీకి ఇచ్చిన తోఫాగా చెప్పాలి.


జాతీయ ప్రాజెక్టుగా పోలవరం ప్రకటించి...పోలవరం నిర్మాణానికి అయ్యే వ్యయం అంతా కేంద్రమే భరించేలా అంగీకరించింది.2014 ఎన్నికల అనంతరం కేంద్రంలో యూపీఏ సర్కార్‌ స్థానంలో వెూడీ నాయకత్వంలోని ఎన్డీయే సర్కార్‌ కొలువుదీరింది. ఎన్డీయే రాష్ట్రంలో కొలువుదీరిన తెలుగుదేశం ప్రభుత్వం భాగస్వామ్య పక్షంగా పోలవరం వ్యయం కేంద్రం భరిస్తే నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను చేపట్టింది.



అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు చొరవ కారణంగా పోలవరం నిర్మాణం జోరందుకుంది. అయితే అప్పట్లో విపక్ష నేతగా ఉన్న జగన్‌ కు రాష్ట్ర ప్రయోజనాల దష్ట్యా పోలవరం పూర్తి కన్నా...పోలవరం నిర్దిష్ట కాలంలో పూర్తికాకపోతే తనకు ఒనగూరే రాజకీయ ప్రయోజనంపైనే శ్రద్ధ ఎక్కువ కావడంతో పోలవరం అంచనాలు, కాంట్రాక్టులపై విమర్శనాస్త్రాలు సంధించారు.


అయితే అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్ర స్థాయి దర్యాప్తుల్లో ఎటువంటి అక్రమార్గం పోలవరం నిర్మాణంలో జరిగినట్లు ఈ ఏడాదిన్న కాలంలో రుజువు కాకపోయినా, రివర్స్‌ టెండరింగ్‌ పేరిట పనుల వేగాన్ని తగ్గించి...మొత్తంగా నిర్మాణ పనుల స్తంభనకు కారణమయ్యారు.



అయతే రాష్ట్ర సాగు, తాగు, విద్యుత్‌ అవసరాల దష్ట్యా పోలవరం ప్రాముఖ్యత విస్మరింపజాలం. ఇప్పుడు జగన్‌ సర్కార్‌ కు కూడా పోలవరం నిర్మాణం పూర్తి చేయడమన్నది తప్పించుకోలేని బాధ్యత. అయితే ఆ బాధ్యతను తలకెత్తుకోవడానికి గతంలో విపక్ష నేతగా జగన్‌ చేసిన విమర్శలే అడ్డుగా నిలుస్తున్నాయి.


ఎస్టిమేషన్స్‌ పెంచేసి, విపరీతమైన అవినీతికి పాల్పడ్డారంటూ పోలవరం విషయంలో విపక్ష నేతగా జగన్‌ చేసిన విమర్శలు, ఇచ్చిన ప్రకటనలూ, కేంద్రానికి చేసిన ఫిర్యాదులే ఇప్పుడు వైకాపా సర్కార్‌ కు పోలవరం విషయంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు అడ్డంకులుగా, అవరోధాలుగా మిగిలాయి.


కేంద్రం ఇప్పుడు 2013 నాటికి ముందు అంచనాల మేరకే నిధులు విడుదల చేస్తామని కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది. ఎందుకంటే...నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష అన్నట్లుగా జగన్‌ విమర్శలన, ప్రకటనలను, ఫిర్యాదులను చూపుతోంది. వైకాపా పెద్దల తీరు చూస్తుంటే పోలవరం నిర్మణం విషయంలో చేతులెత్తేసి కేంద్రానికి ప్రాజెక్టు నిర్మాణాన్ని అప్పగించేందుకు సిద్ధపడుతున్నట్లుగా కనిపిస్తున్నది.


అదే జరిగితే కొంత కాలం తరువాత కేంద్రం ప్రత్యేక హౌదాలాగే పోలవరం కూడా ముగిసిన అధ్యాయం అంటూ ముక్తాయించే ప్రమాదం ఉంది.


_______________________________________________________________


For more updates:


Follow us on Facebook


 News 9 Telugu Daily


Join our Facebook group


News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:


News 9 India


Comments