పడకంటి మనసులో మాట 18-04-2021



పడకంటి మనసులో మాట ...

______________________________________________________________________

ప్రపంచ దేశాలు అన్నింటికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ డొసులను లక్షలాదిగా బహుకరించడవెూ లేదా అమ్మడవెూ చేసిన భారత్‌ కు ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా తాజాగా కోవిడ్‌ కేసులు దేశవ్యాప్తంగా ప్రబలడంతో సొంత అవసరాలకే ఈ వ్యాక్సిన్లు సరిపోని పరిస్థితిని భారత్‌ ఎదుర్కొంటోంది. ఒక్కసారిగా కథ అడ్డం తిరగడంతో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఎగుమతులను, విక్రయాన్ని భారత్‌ నిలిపి వేయడంతో ప్రపంచ దేశాలలో ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకూ ఈ వ్యాక్సిన్‌ ఎగుమతి చేసిన భారత్‌ కు దాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి తలెత్తడం చాలా చెశాలకు మింగుడు పడటం లేదు.

______________________________________________________


మోడీ సీన్ రివర్స్ – దేశంలో వ్యాక్సిన్ కొరత

విదేశాల ఎగుమతికి బ్రేక్


నిన్నమొన్నటి వరకూ ప్రపంచ దేశాలు అన్నింటికీ కోవిడ్‌ వ్యాక్సిన్‌ డొసులను లక్షలాదిగా బహుకరించడవెూ లేదా అమ్మడవెూ చేసిన భారత్‌ కు ఇప్పుడు ఇంట గెలిచి రచ్చ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్కసారిగా తాజాగా కోవిడ్‌ కేసులు దేశవ్యాప్తంగా ప్రబలడంతో సొంత అవసరాలకే ఈ వ్యాక్సిన్లు సరిపోని పరిస్థితిని భారత్‌ ఎదుర్కొంటోంది.

 ఒక్కసారిగా కథ అడ్డం తిరగడంతో కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఎగుమతులను, విక్రయాన్ని భారత్‌ నిలిపి వేయడంతో ప్రపంచ దేశాలలో ఆందోళన మొదలైంది. నిన్న మొన్నటి వరకూ ఈ వ్యాక్సిన్‌ ఎగుమతి చేసిన భారత్‌ కు దాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితి తలెత్తడం చాలా చెశాలకు మింగుడు పడటం లేదు.

ప్రపంచంలో రెండవ అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్న భారత్‌ లో ఇప్పుడు ఈ వ్యాక్సిన్‌ కొరత పెద్ద సమస్యగా మారుతోంది. గురువారం ఒక్క రోజులోనే రెండు లక్షలకు పైగా కోవిడ్‌ కేసులు తలెత్తడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో భారత్‌ ఈ వ్యాక్సిన్‌ ను దిగుమతి చేసుకుంటున్నది.

 దేశీయంగానే వ్యాక్సిన్‌ తయారు చేస్తున్నప్పటికీ కూడా పెరుగుతున్న కేసుల తీవ్రత నేపథ్యంలో వీటి పరిమాణం ఎంత మాత్రం సరిపోవడంలేదు. రోజూవారీ కేసులు పెరగడంతో పాటు ఆసుపత్రులు కూడా క్రిక్కిరిసి పోవడంతో అన్ని విధాలుగా కొరత పరిస్థితిని భారత్‌ ఎదుర్కొంటున్నది. తక్షణ ప్రాతిపదికన ఈ వ్యాక్సిన్‌ దిగుమతి చేసుకునే విధంగా నియమాలను సడలించింది.



గతంలో ఫైజర్‌ వంటి విదేశీ మందుల కంపెనీలను తిరస్కరించిన భారత్‌ కు ఇప్పుడు దిగుమతులు శరణ్యం కావడంతో మార్గాంతరంపై దష్టి పెట్టింది. భారత్‌ కు చిరకాల మిత్ర దేశమైన రష్యా కు చెందిన స్పుత్నిక వ్యాక్సిన్‌ ను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకునేందుకు సన్నద్ధమవుతోంది.

 ఒక్కసారిగా పరిస్థితితులు తారుమారు కావడంతో దేశీయంగా కోవిడ్‌ ను ఎదుర్కొనే ప్రయత్నాలు మందకొడిగా సాగే అవకాశం కనిపిస్తోంది దాదాపు 60 పేద దేశాలలో
భారత్‌ సారధ్యంలో జరుగుతున్న వ్యాక్సిన్‌ కార్యక్రమానికి గండిపడే అవకాశం కనిపిస్తోంది.


 కోవాక్స కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు మందులను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, గావి వ్యాక్సిన్‌ కూటమి చేపట్టింది.
అయితే భారత్‌ నుంచి భారీ పరిమాణంలో ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందనే నమ్మకంతోనే కోవాక కార్యక్రమాన్ని చేపట్టారు. 
ఔషధాల రంగంలో ఆసియా ఖండంలోనే బలమైన శక్తిగా ఉన్న భారత్‌ తమను ఈ ఆపద సమయంలో ఆదుకుంటుందని ఎన్నో దేశాలు ఆశించాయి. కానీ ఇప్పుడు భారత్‌ కే వాటిని దిగుమతి చేసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. ఈ నెలలో ఇప్పటివరకు 1.2 మిలియన్‌ వ్యాక్సిన్‌ డోసులనే భారత్‌ ఎగుమతి చేసింది.

 ఈ ఏడాది జనవరి మార్చి మధ్య దాదాపు 64 మిలియన్‌ డోసులను ఎగుమతి చేసిన భారత్‌ సొంత అవసరాలపైనే దష్టి పెట్టడం, దీనిపై ఆధారపడిన దేశాలలో ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం దేశంలో ఎమర్జెన్సీ తరహా పరిస్థితి ఉన్నందువల్ల దేశీయ అవసరాలకే మందులు సరిపోవడం లేదని ఎగుమతులపై ఇతర దేశాలకు ఎలాంటి హామీలు ఇవ్వలేమని ఓ అధికారి వెల్లడించారు. ఈ పరిస్థితుల్లో వ్యాక్సిన్‌ ను భారత్‌ దిగుమతి చేసుకోవలసి రావడం అనివార్యమైందని పేర్కొన్న ఓ అధికారి ''మా అవసరాలే తీరనప్పుడు ఇతర దేశాలకు ఎలా ఎగుమతి చేస్తాం'' అని వ్యాఖ్యానించారు.

____________________________________________

కరోనా, మండువేసవి
మునిసిపోల్స్‌కి ఇదా సమయం?

రాజకీయ ప్రయోజం కోసం టీఆర్ఎస్ పాకులాటేనా ?

మండుటెండలు తెలంగాణలోని వివిధ పార్టీల కార్యకర్తలకు పరీక్ష పెడతున్నాయి. ఇప్పటికే సాగర్‌ ఉప ఎన్నికలో నేతలు, కార్యకర్తలు నానాయాతన పడ్డారు. తాజాగా రెండు మున్సిపల్‌ కార్పోరేషన్లు, ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగబోతున్నాయి.


 ఓ వైపు కరోనా ఆందోళన కరంగా పెరుగుతున్న దశలో ఈ ఎన్నికలు మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ప్రజలు ఇంటిపట్టున ఉండి కరోనాకు దూరంగా ఉందామనుకున్నా రాజకీయాల కారణంగా వ్యాప్తికి కారణమవు తున్నాయి. ఎన్నికలను ఎండాకాలం అనంతరం నిర్వహించి ఉండాల్సింది. కానీ ఎంలాంటి చర్చ లేకుండా ఎన్నికలను ప్రకటించేశారు.

 దీంతో వరంగల్‌, ఖమ్మం పట్టణాలతో పాటు సిద్దిపేట తదితర పట్టణాల్లో ప్రజలు గుమికూడకుండా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. వరుస ఎన్నికలతో అధికార పార్టీతో పాటు అనేక పార్టీల కార్యకర్తలు నానాయాతన పడుతున్నారు. ఎప్రిల్‌ ఎండలే కదాని సర్దుకున్నా ఇపðడు మండుటెడల్లో మున్సిపల్‌
ఎన్నికలకు దిగాల్సి వస్తోంది. 


టిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బిజెపి పార్టీలతో పాటు ఇతర చిల్లర పార్టీలకు కూడా ఈ యాతన తప్పడం లేదు. ఎక్కడ వెనకబడి పోతావెూ అన్న భయంతో నేతలు కార్యకర్తలను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. పట్టణ ప్రాంత రాజకీయాలతో ముడిపడి ఉన్న ఎన్నికలు పార్టీ గుర్తు విూదనే జరగనుండడంతోనే ఇప్పటినుంచే రాజకీయ పార్టీలు వ్యూహాలు రూపొందిస్తున్నాయి.


 ఎండలకు తోడు కరోనా వేడి రాజుకుంటోంది. ఎన్నికల ప్రకటన రావడంతో అన్ని పార్టీలు మళ్లీ పోటీకి సమాయత్త మవుతున్నాయి. గెలుపు గుర్రాలను బరిలో దించి పాగా వేసేందుకు వ్యూహారచన చేస్తున్నాయి. స్థానిక సంస్థల్లోనైనా కాస్త పట్టుపెంచు కునేందుకు కాంగ్రెస్‌, కొన్నిచోట్లనైనా ఖాతా తెరిచేలా భాజపా ఇలా ఎవరికి వారు అంచనాలు వేస్తున్నారు.


 ఆయా పార్టీల అధిష్ఠానాలు ఎన్నికలపై ప్రత్యేక దృష్టిపెట్టాయి. మరోవైపు ఎండలతో కార్యకర్తలు వాపోతున్నారు. వేసవిని తలచుకుంటేనే భయం వేస్తోందని అంటున్నారు. మొత్తంగా మున్సిపలు ఎన్నికలు ఎండలకు మించి పరీక్ష పెడుతున్నాయి. మొత్తవ్మిూద మళ్లీ పార్టీల హడావిడితో పట్టణాల్లో ఎన్నికల వేడి మొదలైంది. రాజకీయ ప్రయోజనం కోసమే టీఆర్‌ఎస్‌ మునిసిపోల్స్‌కు తొందరపడుతోందని కాంగ్రెస్‌ విమర్శిస్తోంది.

____________________________________________

తిరుపతి దొంగ ఓట్ల
పంచాయతీ తేలేదెలా?

తిరుపతి ఉపఎన్నిక పోలింగ్‌ లో ఇతర ప్రాంతాల నుంచి దొంగ ఓటర్లను వైసీపీ పెద్ద సంఖ్యలో తిరుపతికి రప్పించిందంటూ టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతికి ప్రైవేటు బస్సులు, ఇతర వాహనాల్లో దొంగ ఓటర్లను తరలిస్తున్నారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కెనడీ నగర్‌, లక్ష్మీపురం కూడలి వద్ద దొంగ ఓటర్లను తీసుకొస్తున్న బస్సులను ఆపి, రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్‌ బూత్‌ లకు వచ్చిన దొంగ ఓటర్లను కూడా అడ్డుకున్నారు. వారి నుంచి నకిలీ ఓటరు కార్డులు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాలను పోలీసుల దష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని అంటున్నారు.


 మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కన్వెన్షన్‌ సెంటర్‌ లో వందలాది మంది దొంగ ఓటర్లను నిన్ననే తీసుకొచ్చి పెట్టారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారంతా అక్కడి నుంచి తప్పించుకున్నారని తెలిపారు.


 తిరుపతి ఉప ఎన్నికలో పెద్ద ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయని టీడీపీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. వీడియోను పోస్ట్‌ చేస్తూ వైసీపీ నేతలపై టీడీపీ నేత నారా లోకేశ్‌ విమర్శలు చేశారు. పుంగనూరు వీరప్పన్‌ పెద్దిరెడ్డి.. ఎర్రచందనం చెట్లను నరికేస్తున్నట్టే ప్రజాస్వామ్యాన్నీ ఖూనీ చేస్తున్నాడు.


తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి బయటి నుంచి తన ముఠాలను తీసుకొచ్చి పెద్ద ఎత్తున దొంగ ఓట్లు వేయిస్తున్నాడు' అని ఆరోపించారు.'పెద్దిరెడ్డి మనుషులు 5 వేల మంది పెద్దిరెడ్డికే చెందిన పీఎల్‌ఆర్‌ కల్యాణ మండపంలో మకాం వేసి దొంగ ఓట్లు వేయడానికి వెళ్తుంటే టీడీపీ నాయకులు అడ్డుకున్నారు.

 రాష్ట్ర ఎన్నికల సంఘం పర్యవేక్షణలో జరిగిన పంచాయతీ, మున్సిపల్‌, పరిషత్‌ ఎన్నికల్లో పోలీసులు అధికార యంత్రాంగాన్ని వాడుకుని ఎలక్షన్‌ జరగకుండా సెలక్షన్‌ చేయించుకున్న మంత్రి పెద్దిరెడ్డి.. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న తిరుపతి ఎన్నికని అక్రమార్గంలో గెలవాలని నేరుగా తానే రంగంలోకి దిగారు' అని లోకేశ్‌ చెప్పారు.'తిరుపతి ఉపఎన్నికలో రిగ్గింగ్‌, దొంగ ఓట్లతో నెగ్గాలని వేసిన ప్రణాళికని తెలుగుదేశం బట్టబయలు చేసింది. ఇప్పటికైనా కేంద్ర ఎన్నికల కమిషన్‌ స్పందించి పెద్దిరెడ్డి, వైసీపీ మంత్రుల్ని అదుపులోకి తీసుకోవాలి. దొంగ ఓట్లు వేసేందుకు ఇతర ప్రాంతాల తరలివచ్చిన వేలాది మందిని అరెస్ట్‌చేసి సూత్రధారులపై చర్యలు తీసుకోవాలి' అని లోకేశ్‌ కోరుతున్నారు.

______________________________________________________

For more updates:


Follow us on Facebook

 News 9 Telugu Daily


Join our Facebook group

News 9 Telugu Daily Public Group


Follow us on Instagram:

News 9 India

______________________________________________________________________

#news9 #news_9 #news9india #india #telangana #andhrapradesh #hyderabad #warangal #newspaper #telugu #news9telugu #telugunews #padakanti #padakantivenkateshwarlu #news9telugudailypaper #news9epaper #news9updates #news9hindi #news9english #news9weekly #news9monthly #news9magazine #news9daily #news9telugudaily #news9paper #news9telugupaper #news9telangana #news9andhrapradesh #manasulomaata #padakantimanasulomaata

Comments