పడకంటి మనసులో మాట ...
తాపత్రయమే తప్ప ప్రజలకు పట్టని ఫలితాలు
కరోనా కాలంలో వెూడీ సర్కార్ ఎన్నికల విషయంలో అనుసరించిన తీరు పట్ల ప్రజలలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఫలిలాలు ఎలా ఉన్నా...అవి వెూడీ ఇమేజ్‌ను ఇసుమంతైనా పెంచే అవకాశం లేదు.
జనం కరోనా మహమ్మారి నుంచి రక్షణ ఎలా అని ఆవేదన చెందుతున్న సమయంలో కరోనా కట్టడి చర్యలను గాలి కొదిలేసి ఎన్నికల ప్రచారంలో పూర్తిగా నిమగ్నమైన ప్రధాని వెూడీ విపక్షాలపై విమర్శలు వినా మహమ్మారి నుంచి రక్షణ కల్పిస్తామన్న భరోసా ఇవ్వడంలో విఫలమయ్యారు. సెకండ్ వేవ్ విజృంభణకు వెూడీ ఎన్నికల ర్యాలీలు కూడా కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
వ్యవస్థలపై కేంద్రం పెత్తనం వల్లే బెంగాల్‌లో ఎనిమిది దశల సురీర్ఘ ఎన్నికల ప్రక్రియ అన్న విమర్శలకు వెూడీ జవాబు చెప్పుకోక తప్పదు కరోనా సంక్షోభాన్ని, సెకండ్ వేవ్ తీవ్రతను పక్కన పెట్టి..ప్రజల ప్రాణాలను పణంగా పెట్టి నిర్వహించిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో ఎవరి సత్తా ఏమిటో ఆదివారం తెలియబోతున్నది. ఐదురాష్ట్రాల ఎన్నికల కౌంటింగ్ ఆదివారం జరుగబోతున్నది.
పశ్చిమబెంగాల్,తమిళనాడు, అసోం,పాండిచ్చేరి,కేరళ రాష్ట్రాల ఎన్నికలతో పాటు తిరుపతి, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల ఫలితాలు తేలనున్నాయి. అయితే ఈ ఎన్నికల తరవాత వచ్చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే బిజెపికి ఎక్కడా పెద్దగా ఆశాజనకంగా ఫలితాలు ఉండకపోవచ్చని అంటున్నారు.
అలాగే ప్రజలు కరోనాతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న క్రమంలో ఎన్నికలు, ఫలితాలపై పెద్దగా ఆసక్తిగా లేరనే చెప్పాలి. ముఖ్యంగా అధికారంలో ఉంటూ గత ఏడేళ్లుగా ప్రజల సంక్షేమాన్ని విస్మరించిన వెూడీ ద్వయానికి ఈ ఫలితాలు పరీక్షగానే నిలుస్తాయి.
కరోనా తీవ్రంగా విస్తరించి ప్రజలు ప్రాణవెూ భగవంతుడా అని అంటున్న తరుణంలో పట్టుబట్టి మరీ ఎన్నికలు నిర్వహించిన ఘనత ఓ రకంగా వెూడీదే అని చెపðకోవాలి. ప్రజలకు ఆక్సిజన్ అందక, వైద్యం దొరక్క ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బతుకీడిస్తున్న తరుణంలో పాలకులు తమ పైశాచిక ఆనందం తమదే అన్నట్లుగా వ్యవహరించారు.
హైకోర్టులు,సుప్రీం కోర్టు హెచ్చరిస్తున్నా ఎన్నికల నిర్వహణెళి అంతిమ లక్ష్యంగా కేంద్రంలోని పెద్దలు వ్యవహరించారు. నిజానికి బిజెపికున్న ఇమేజ్‌ను దెబ్బతీసారు. బిజెపి అధికారంలోకి వస్తే అద్భుతాలు సృష్టిస్తుందని అనుకున్న భ్రమలు తొలగిపోయాయి. వాజ్‌పేరు,అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుష్మాస్వరాజ్ లాంటి నేతలున్న పార్టీ ఇప్పటి బిజెపి కాదు.
మొత్తంగా బిజెపి తన సిద్ధాంతాలను విడిచి ప్రయాణిస్తోంది. నెలన్నరపాటు దఫదఫాలుగా జరిగిన ఈ అసెంబ్లీ ఎన్నికలపై జనంలో గతంతో పోలిస్తే ఆసక్తి తగ్గింది. బెంగాల్‌లో ఈసారి ఎలాగైనా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్‌ను గద్దె దించాలన్న కృతనిశ్చయంతో వున్న బీజేపీ అందుకు తగినట్టు భారీ స్థాయిలో ప్రచార యుద్ధం సాగించింది.
ఆ రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర వెూదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా వంటి హేమాహేవిూలు సభలు, ర్యాలీల్లో పాల్గొన్నారు. అన్నిచోట్లా భారీయెత్తున జనం హాజరయ్యారు. కరోనా వైరస్ విజృంభణను పట్టించుకోకుండా, దాన్ని నియంత్రించడానికి అవసరమైన వ్యూహాలు రూపొందించ కుండా బెంగాల్‌పైనే వెూదీ దృష్టి సారించారన్న విమర్శలు కూడా వచ్చాయి.
మమత సైతం బీజేపీకి దీటుగా ముందుకురికారు. ఇంత సుదీర్ఘమైన పోలింగ్ షెడ్యూల్ ప్రకటించినందుకు ఎన్నికల సంఘాన్ని కూడా అనేకులు తపðబట్టారు. చివరి మూడు దశలనూ ఒకే దశగా మార్చి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ వచ్చినా సంఘం పెద్దగా స్పందించలేదు.
బెంగాల్లో 8వ విడత 29న ఆఖరి దశ పోలింగ్ పూర్తయ్యాక యధావిధిగా వెలువడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు చూస్తుంటే అధికార బిజెపికి ఆశాజనకంగా లేదనే చెప్పాయి. పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిదో దశ పోలింగ్‌తో అక్కడి సుదీర్ఘ ఎన్నికల పక్రియ ముగియ డంతో కౌంటింగ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది.
కరోనా మహమ్మారి దేశమంతా స్వైర విహారం చేస్తూ, పౌరుల ప్రాణాలు తోడేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మునుపటిలా ఫలితాలపై ప్రజల్లో పెద్దగా ఆసక్తి కానరావడం లేదు. మొదటినుంచీ అందరూ అనుకుంటున్నదే దాదాపుగా ఈ సర్వేలు కూడా చెప్పాయి.
పశ్చిమ బెంగాల్‌లో హోరాహోరీ పోరుంటుందని, తమిళనాట డీఎంకే, అస్సాంలో బీజేపీ, కేరళలో వరసగా రెండోసారి వామపక్ష ప్రజాతంత్ర కూటమి(ఎల్‌డీఎఫ్) విజయం సాధించవచ్చని జోస్యం చెప్పాయి. పుదుచ్చేరిలో తొలిసారి ఎన్‌డీఏకు అధికారం దక్కబోతున్నదని అంచనా వేశాయి.
అంకెల్లోనే కాస్త వ్యత్యాసాలున్నాయి. అయితే చివరి రెండు దశల పోలింగ్‌నాటికి దేశం నలుమూలలా కరోనాపర్యవసానంగా నెలకొన్న విషాదకర పరిస్థితులు బెంగాల్‌ను ఏమేరకు ప్రభావితం చేసివుంటాయన్నది వేచిచూడాలి. తమిళనాడులో నేతలు పాల్గొన్న సభల్లో భౌతిక దూరం పాటించడం, మాస్క్‌లు ధరించడం వంటివి లేకున్నా అది పట్టించుకోలేదని, ఫలితంగా కరోనా కేసులు పెరిగాయని దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా మద్రాస్ హైకోర్టు చేసిన వ్యాఖ్యలు ఎన్నికల సంఘానికి కనువిపð కావాలి.
ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ ఒత్తిడికి తొలగ్గి ఎన్నికలు నిర్వహించడం సరైందికాదు. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నాయకులు కట్టుతప్పినపðడు కూడా ఇలాంటి ఆదేశాలు వచ్చివుంటే బాగుండేది. పార్టీలతో నిమిత్తం లేకుండా, పదవులతో సంబంధం లేకుండా తగిన చర్యలకు ఉపక్రమిస్తే మరింత బాగుండేది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌వెూహన్ రెడ్డి తిరుపతి ఉప ఎన్నిక బహిరంగసభను కరోనా విజృంభణ కారణంగా రద్దు చేసుకున్నతీరు అభినందనీయం. ఈసీ కూడా ఆ దిశగా ఆలో చించి ప్రచారపర్వాన్ని కుదించడం, ఆంక్షలు విధించడం వంటివి చేసివుంటే బాగుండేది. ఇకపోతే ఫలితాలు ఎలా ఉన్నా ఒరిగేదేవిూ లేదు.
మరో రాష్ట్రాంలో బిజెపి అధికారంలోకి వచ్చినా పెద్దగా ప్రజలకు ఒనగూరే లాభం ఉండదు. వివిధ రాష్ట్రాల్లో బిజెపి పాలన నానాటికి తీసిట్టుగా మారింది. ప్రజలెపðడూ కూడబలు క్కున్నట్టు ఒకే మాదిరి ఓటేస్తారు. కానీ వ్యక్తులుగా ఎవరికి వారు విజేతల గురించి అయోమయంలో వుంటారు. ఫలితాలు వెలువడినపðడు ఆశ్చర్యపోతారు.
పోలింగ్ రోజున సర్వే చేసేవారిని ముపðతిప్పలు పెడతారు. ఓటేసింది ఒకరికైతే మరొకరి పేరు చెబుతారు. వారిని మాటల్లోపెట్టి ఎటువైపు మొగ్గుందో తెలుసు కోవడం అంత సులభమేవిూ కాదు. ఆదివారం ఎటూ వాస్తవ ఫలితాలు వస్తాయి. ఆ ఫలితాలు ఎగ్జిట్ పోల్స్‌కు దగ్గరగా ఉన్నాయా లేదా అన్నది చూడాలి. అలాగే ప్రజలు కూడా కరోనా వేళ ఎలా స్పందించారన్నది కూడా తేలనుంది. అయితే దేశంలో ప్రజలు మాత్రం ఈ ఫలితాలపై పెద్దగా ఆసక్తిగా లేరన్నది మాత్రం నిజం. కేవలం స్థానిక ప్రజలు మాత్రమే వీటిపై స్పందించే అవకాశాలు ఉన్నాయి.
____________________________________________________
ఈటెలపై కుట్రేనా?
హైదరాబాద్, మంత్రి ఈటల రాజేందర్ భూ కబ్జా ఆరోపణల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టిస్తోంది.. భూకబ్జా ఆరోపణలు వెలుగు చూడడం.. ఆ వెంటేనే సీఎం కేసీఆర్ విచారణకు ఆదేశించడం.. చకాచకా జరిగిపోగా.. ఇపðడు విచారణ కూడా ప్రారంభం అయ్యింది. ఇదంతా ఓ పద్దతి ప Ö-రకారం జరిగినట్లుగా అర్థం అవుతోంది.
ఈటెలను తప్పించడానికే రంగం సిద్దం చేశారని కూడా తెలుస్దోంది. ఇప్పటికే అచ్చంపేట ప్రభుత్వ స్కూల్ కి చేరుకున్న ఎమ్మార్వో, విజిలెన్స్ అధికారులు.. బాధితుల నుంచి సమాచారం సేకరించడం మొదలు పెట్టారు. మరోవైపు కలెక్టర్ ఇప్పటికే అసైన్డ్ భూముల ఆక్రమణ జరిగిందని నిర్ధారణకు వచ్చారు.
ఇదంతా ఈటెలను ఇరికించడం ద్వారా ఆయనకు ఉద్వాసన చెప్పే ప్రయత్నాలుగా ప్రజలు భావిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అచ్చంపేట గ్రామ పరిధిలో భారీగా పోలీసు బలగాలను వెూహరించారు.
మరోవైపు.. వరంగల్ అర్బన్ జిల్లా మంత్రి ఈటల రాజేందర్ స్వగ్రామం కమలాపూర్ సహా హుజూరాబాద్ నియోజక వర్గంలో అడుగడుగునా భారీగా వెూహరించారు పోలీసులు.. అడుగడుగునా నిర్బంధాలు కొనసాగుతున్నాయి ఈటల అభిమానులు మండిపడుతున్నారు.. ఈటల రాజేందర్ పై వేటువేసే ఉద్దేశ్యంతోనే పోలీసులను వెూహరించారనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు కొంత కాలంగా పార్టీలో ధిక్కార స్వరం వినిపిస్తున్న మంత్రి ఈటల రాజేందర్ వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతుందో అని రాజకీయ నేతలు , ప్రజలు ఆసక్తిగా చూస్తున్నారు.
మెదక జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట, హకీంపేటలో అసైన్డ్ భూముల ఆక్రమణ అంశంలో ఈటలపై వచ్చిన ఆరోపణలపై తోణ చర్యలకే సిఎం కెసిఆర్ నిర్ణయించారని అంటున్నారు. రాజకీయ వర్గాలతోపాటు ప్రజల్లో ఆద్యంతం ఆసక్తిగా ఉంది.
రెండోసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పార్టీ, అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్న ఆయన పలుమార్లు తన అభిప్రాయాన్ని నర్మగర్భంగా చెపుతూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. అయితే.. ప్రజల పక్షాన మాట్లాడుతు న్నానంటూ... కొన్ని సార్లు ప్రభుత్వంపై వాగ్బాణాలు సంధించేందుకూ వెనుకాడలేదు.
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రిగా ఇటీవల చురుకైన పాత్ర పోషిస్తున్న ఈటల తన సమర్ధతను చాటుకున్నారు. వ్యాక్సిన్ కొరత విషయంలో కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టారు. అంతా సర్దుకుంటుందనుకునే లోపే శుక్రవారం మధ్యాహ్నం వెలుగులోకి వచ్చిన మాసాయిపేట మండలంలోని అసైన్డ్ భూముల వివాదం కొత్త చర్చకు దారితీసింది. రాష్ట్ర రాజకీయాల్లో కరీంనగర్‌లో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది.
_________________________________________________
ఇప్పుడు పరీక్షలు అవసరమా ?
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన రెడ్డి తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లని అనడమే కాకుండా...కాదు కాదు నాలుగు కాళ్లని ఎవరైనా అంటే సహించలేని పరిస్థితుల్లో ఉన్నారు.
ఏపీలో రోజులు 15 వేల మంది కరోనా రక్కసి బారిన పడుతుంటే...రాష్ట్రంలో ఆక్సిజన్, పడకల కొరత, వ్యాక్సిన్ పంపిణీలో లోపాలను సవరించి, కరోనా కట్టడి చర్యలపై దృష్టి పెట్టడం మాని పరీక్షలు నిర్వహించడం ప్రభుత్వానికి జీవన్మరణ సమస్య అన్నట్లుగా జగన్ వ్యవహరిస్తున్నారు.
లక్షల మంది విద్యార్థులు టెన్త్, ఇంటర్ పరీక్షల కోసం బయటకు రావడం ఇప్పుడు సరైనదేనా ముఖ్యమంత్రి స్వయంగా తాడేపల్లిలోని తన అధికారిక నివాసం నుంచి అడుగు బయట పెట్టడం లేదు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచార సభలను సైతం రద్దు చేసుకున్నారు.
వర్చువల్ భేటీలకే పరిమితమయ్యారు. మరి అటువంటప్పుడు విద్మార్థులను ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరీక్షలు రాయమని ఎలా చెబుతున్నారు. విద్యార్థులకు వ్యాక్సినేషన్ ఇవ్వలేదు. ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కూడా లేదు. ఆయనే స్వయంగా జూన్ వరకూ ఈ ప్రక్రియ పూర్తి కాదని చెప్పారు. కనీసం పరీక్షలను వాయిదా వేసి వంద శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయిన తరువాత నిర్వహించాలన్న నిర్ణయం తీసుకుంటే బాగుండేది.
కానీ ఆయనకు తోచింది చేయడమే తప్ప హేతు బద్ధమైన వివరణ ఇవ్వడం అన్నది కనిపించడం లేదు. రాష్ట్రంలో కరోనా కట్టడిని ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలనేవే కనిపించడం లేదు. అనివార్యంగా నైట్ కర్ఫ్యూ విధించారు. అయితే పగటి రద్దీని నియంత్రించే విషయంలో ఎటువంటి చర్యలూ తీసుకున్న దాఖలాలు కనిపించవు.
కరోనా పరీక్షలు నిర్వహించేసి సంఖ్యలు ప్రకటించేసి చేతులు దులుపుకుంటున్నట్లుగా ఏపీ సర్కార్ తీరు ఉంది, దేశంలోని దాదాపు అన్ని రాష్ట్రాలూ పరీక్షలను రద్దు చేయడం, వాయిదా వేయడం చేశాయి. జగన్ కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.
________________________________________________
For more updates:
Follow us on Facebook
Follow us on Twitter
Join our Facebook group
News9 Telugu Daily Public Group
Join our Telegram Channel