ALL పడకంటి మనసులో మాటలు ...
పడకంటి మనసులో మాట 12.07.2020
July 12, 2020 • Venkateshwarlu • పడకంటి మనసులో మాటలు ...

పడకంటి మనసులో మాట.....

________________________________________________________________

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలోనూ, ఐటీ కేంద్రంగా భావిస్తున్న పుణె నగరంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ నియంత్రణలోనికి రావడం లేదు. ఒకే రాష్ట్రంలో రెండు రకాల పరిస్థితులు ఉన్నాయి. దీనిని బట్టి అర్ధం చేసుకోవలసిందేమిటంటే... ప్రజా సహకారం, రాజకీయాలకు అతీతంగా మహమ్మారి వ్యాప్తి పై జనంలో చైతన్యం తీసుకురావడం ద్వారా మాత్రమే మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడం సాధ్యమౌతుంది.

________________________________________________________________

విమర్శ, వివేచన, వివేకం 

 

కరోనా మమమ్మారి ఒక్క భారత్‌నే కాదు...ప్రపంచం మొత్తాన్నీ వణికిస్తోంది. మహమ్మారికి మందు లేదు. కంటికి కనిపించదు. లక్షణాలు బయటడే వరకూ ఎవరికి కరోనా సోకిందో తెలియదు. మహమ్మారి వ్యాప్తి ప్రచండ వేగంతో ఉండటంతో రోగుల సంఖ్య పెరుగుతోంది. వైద్యులు, వైద్య సిబ్బందిపై అనివార్యంగా ఒత్తిడి పెరుగుతోంది.

మహమ్మారి నియంత్రణ విషయంలో కేంద్రం చర్యలు తీసుకుంటున్నది. ముందు జాగత్రచర్యగా విధించిన లాకడౌేన్‌ వల్ల వ్యాప్తి వేగం మందగించేందుకు, కరోనాపై ప్రజలలో చైతన్యం కలిగించేందుకు అవకాశం ఏర్పడింది. కరోనా విజృంభణ దేశం అంతటా తీవ్రంగా ఉంది.

మహమ్మారి విజృంభణ తీవ్రత అధికంగా ఉన్న రాష్ట్రాలలో బీజేపీ పాలిత రాష్ట్రాలూ ఉన్నాయి, విపక్ష ప్రభుత్వాలు అధికారంలో ఉన్న రాష్ట్రాలూ ఉన్నాయి. కరోనా మహమ్మారికి అధికార పార్టీ, విపక్షం, సంపన్నులు, పేదలు అన్న తేడా లేదు. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనాను శాశ్వతంగా అంతం చేయడం సాధ్యం కాదంటూ బాంబు పేల్చింది.

మరణాలను తగ్గించగమని, అందుకోసం చర్యలు తీసుకోవడం ఒక్కటే మార్గమని పేేర్కొంది. అయితే విపక్షాల విమర్శలు ఈ అంశాలను పరిగణనలోనికి తీసుకున్నట్లు కనిపించదు. అధికారంలో ఉన్న వారిపై విమర్శలు గుప్పించడం ఒక్కటే తమ పని అన్నట్లుగా వాటి తీరు ఉంది.

వైఫల్యాలపై విమర్శలు చేయడం ఎవరూ అభ్యంతర పెట్టరు. కానీ కరోనా విపత్తు గతంలో ఎన్నడూ ఎరగని ఒక మహమ్మారి. ఈ విపత్తు కాలాన్ని ప్రపంచ దేశాలన్నీ ప్రపంచయుద్ధ సమయం నాటి పరిస్థితిగా భావిస్తున్నాయి. సమష్టితత్వం, ఐకమత్యంగా వ్యవహరించి మహమ్మారి వ్యాప్తిని నియంత్రించడం వినా మరో మార్గం లేదు.

అందరూ అంగీకరించిన, అంగీకరించి తీరాల్సిన వాస్తవం ఇది. అయితే స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం కరోనా వ్యాప్తి నిరోధానికి కేంద్రం తీసుకుంటున్న ప్రతి చర్యనూ విమర్శించడమే మార్గమని భావిస్తున్న వారు ఆ విమర్శ విషయంలో వికేకాన్ని, వివేచనను విస్మరిస్తున్నారు.

ముంబైలో ఉన్న అతి పెద్ద మురికి వాడ ధారవీలో కరోనాను నియంత్రించడంలో అక్కడి అధికార యంత్రాంగం, ప్రభుత్వం గణనీయమైన పురోగతి సాధించాయి. అదే సమయంలో దేశ ఆర్థిక రాజథాని ముంబై మహానగరంలోనూ, ఐటీ కేంద్రంగా భావిస్తున్న పుణె నగరంలోనూ కరోనా మహమ్మారి విజృంభణ నియంత్రణలోనికి రావడం లేదు.

ఒకే రాష్ట్రంలో రెండు రకాల పరిస్థితులు ఉన్నాయి. దీనిని బట్టి అర్ధం చేసుకోవలసిందేమిటంటే...ప్రజా సహకారం, రాజకీయాలకు అతీతంగా మహమ్మారి వ్యాప్తిపై జనంలో చైతన్యం తీసుకురావడం ద్వారా మాత్రమే మహమ్మారి వ్యాప్తినిన నియంత్రించడం సాధ్యమౌతుందని.

భారత సంస్కృతిలోనే రోగ నిరోధక శక్తిని ఇనుమడింప చేయడానికి అనేక ప్రాకృతిక ఔషధాల వినియోగం ఒక అలవాటుగా, ఒక సంప్రదాయంగా ఉంది. ఇదే విషయాన్ని బ్రిటిష్‌ యువరాజు ప్రిన్స్‌ చార్లెస్‌ తాజాగా చెప్పారు. ప్రపంచ దేశాలకు భారత్‌ ఆదర్శం కావాలన్నారు. మూడు వారాల కిందటి వరకూ బ్రిటన్‌ కరోనా మహమ్మారి వ్యాప్తిని అరికట్టే దారి కనిపించక గిలగిలలాడింది.

ఆ దేశ ప్రధాని, ఆరోగ్య మంత్రి సహా కరోనా బారిన పడ్డారు. అసలు బ్రిటన్‌ బతికి బట్టకడుతుందా అని ఆ దేశ ప్రజలు బెంబేలెత్తిపోయారు. అయితే భారత సంప్రదాయక ఔషధాలే ఆ దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తిని కనీస స్థాయికి తీసుకువచ్చాయి. ప్రధాని వెూడీ మొదటి నుంచీ ఇదే చెబుతూ వస్తున్నారు.

విపక్షాలు ఇప్పటికైనా ఈ విపత్కర సమయంలో విమర్శల బాట వీడి మహమ్మారి నియంత్రణకు రాజకీయాలకు అతీతంగా చేతులు కలపాల్సిన అవసరం ఉంది. జాగ్రత్తలు తీసుకుంటూనే ప్రజల బతుకుబండి సజావుగా నడిచేందుకు చర్యలు తీసుకోవలసిన బాధ్యత ప్రభుత్వానికి అయితే అందుకు సహకరించాల్సిన బాధ్యత ప్రతిపక్షాలది.

________________________________________________________________

విమర్శలు సరే..సూచనలేవీ 

 

తెలంగాణలో మాత్రమే కాదు దేశవ్యాప్తంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లోనూ కరోనా విజృంభిస్తోంది. కరోనాకు బిజెపి, కాంగ్రెస్‌, టిఆర్‌ఎస్‌ అన్న తేడా లేదు. అన్ని రాష్ట్రాల్లోనూ ఆయా ప్రభుత్వాలు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే ఉన్నాయి. కరోనాకు మందు లేని కారణంగా ఫలానా వైద్యం చేయలేదన్న పరిస్థితి లేదు.

ఇక రాష్ట్రంలో కరోనా కట్టడిపై ప్రభుత్వ వైఫల్యం విూద అసంతృప్తి గట్టిగా రగులుతున్న విషయం వాస్తవమే. తెలంగాణకు సంబంధించినంత వరకు ఇక్కడ విపక్షాలు కరోనా కట్టడిలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం కంటే...రాజకీయ లబ్ధి, ప్రయోజనంపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నాయి.

గాంధీ ఆస్పత్రి లేదా పైవేట్‌ ఆస్పత్రుల్లో అక్రమాలు జరిగితేే, సరిగా వైద్యం అందకపోతేనో మంత్రి ఈటెల రాజేందర్‌ లేదా కెటిఆర్‌లను కలుసుకుని చర్చించవచ్చు. కలిసి సమస్యలను వివరించే అవకాశం ఉంది. అయితే వీటి వేటినీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో ఎందుకు లేరన్న విషయానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.

నాయకుడిగా కేసీఆర్‌ సమస్య తీవ్రతను పట్టించుకోవడం లేదనో, సరైన సమయంలో సరైనా నిర్ణయాలు తీసుకోవడం లేదనో కాదు...విపక్షాల విమర్శ. ఆయన ప్రగతి భవన్‌లో ఎందుకు ఉండటం లేదన్నదే వారి సమస్యగా మారిపోయింది. నాయకుడిగా ముఖ్యమంత్రి అధికార యంత్రాంగానికి ఆదేశాలు ఇస్తారు.

ప్రభుత్వ యంత్రాంగం ఆ ఆదేశాలకు అనుగుణంగా క్షత్రస్థాయిలో పని చేస్తున్నారా లేదా అన్నది చూడాలి. అంతే కానీ క్షేత్ర స్థాయిలో సీఎం లేరెందుకని అడగడం వివేకం కాదు. అసలు విపక్షాలు ఇప్పటి వరకూ ప్రభుత్వంపై విమర్శలు కురిపించడానికి చూపిన శ్రద్ధ సమస్య పరిష్కారంపై చూపుతున్న దాఖలాలు కనిపించడం లేదు.

అసలు ఇక్కడ జనం సహా అందరూ అర్ధం చేసుకోవలసిన విషయం ఏమిటంటే...కరోనా పేరు చెప్పి జనాలను జైళ్లలో బంధించినట్లుగా ఇళ్ల నుంచి కదలకుండా భరించడం సరికాదు. ఎవరికి వారుగా స్వీయ నియంత్రణ, జాగ్రత్త పాటించాల్సి ఉంది. కారుచిచ్చులాగా రోజురోజుకూ వ్యాధి వ్యాపిస్తుంటే కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వ్యవహరిస్తుంటే ముప్పు తప్పదు.

ఇది స్వయంగా కేసీఆర్‌ ఇంటింటికీ తిరిగి ప్రజలందరికీ మాస్కులు తొడగడం వల్లే సాధ్యమౌతుందని విపక్షాలు భావిస్తున్నట్లు తోస్తున్నది. మంత్రి పద్మారావుకు కరోనా సోకడానికి ఆయన నిర్లక్ష్యమే కారణమని ఒక సభలో మంత్రి కేటీఆర్‌ చెప్పడం వెనుక ఉద్దేశం ఇదే.

ప్రజలు, విపక్షాలు వారు జాగ్రత్తలు తీసుకోవాలి. అందుకు అవసరమైన సూచనలను ప్రభుత్వం ప్రకటిస్తుంది. లాక డౌన్‌ సడలింపు అన్నది అనివార్యమైన చర్య. సడలింపులు లేకుండా ఆర్థిక సంక్షోభమే కాదు...నెలల తరబడి ఇళ్లకే పరిమితమై ప్రజలలో సైకలాజికల్‌డిజార్డర్‌కు దారి తీసే ముప్పు ఉందని మానసిక నిపుణులు సైతం హెచ్చరిస్తున్నారు.

కరోనా వ్యాప్తి తీవ్రత గురించి విపక్షాలు ఆందోళన వ్యక్తం చేయడంలో తప్పు లేదు. ప్రభుత్వమే కాదు, వ్యాప్తి కట్టడి విషయంలో ప్రజలలో చైతన్యం తీసుకురావలసిన బాధ్యత విపక్షాలపై కూడా ఉంది. ఆ బాధ్యతను విస్మరించి కేవలం విమర్శలకే విపక్షం పరిమితమైతే..అంతిమంగా నష్టం జరిగేది ప్రజలకే.

ఈ విషయం విపక్షాలు గుర్తించాలి. రాజకీయ విభేదాలన్నవి పరిస్తితులు మామూలుగా ఉన్నప్పుడు తప్ప విపత్తు సమయంలో కాదు. ముప్పు తీవ్రతపై అధికార, విపక్షాల సమష్టి అధ్యయనం ఏదో ఒక పరిష్కారం వైపుగా కదిలించడానికి అవకాశం ఇస్తుంది. ప్రభుత్వం సరిగ్గా చేయడం లేదని ఆస్పత్రుల ముందు ధర్నాలూ, ఆందోళనలకు దిగడం వల్ల వ్యాప్తి మరింత తీవ్రం కావడం తప్ప మరో ప్రయోజనం ఉండదు.

విపక్ష నేతలుగా ఆసుపత్రులకు వెళ్లి వైద్యులతో చర్చించి సమస్య పరిష్కారం కోసం తమ వంతు కృషి చేయాలి. అలాగే ఆసుపత్రులలో సమస్యలను ప్రతిపక్షం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలి. అందుకు భిన్నంగా ఆందోళనలకు దిగడం వల్ల మహమ్మారివ్యాప్తి మరింత పెరిగేందుకు దోహదపడిన వారౌతారు.

ఇక కరోనా పరీక్షల విషయంలో తెలంగాణ సర్కార్‌ మరింత వేగం పెంచాల్సిన అవసరం ఉంది. అనేక వర్గాల నుంచి పదేపదే విమర్శలు వచ్చినవిూదట, 50వేల పరీక్షలు ఒక పదిరోజుల కాలంలో చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఈ పరీక్షలు కూడా ఎవరికి పడితే వారికి చేసేవి కావు.

వ్యాధి సోకినవారి కుటుంబసభ్యులు, సన్నిహితులు, వారికి సవిూపంగా మెలగినవారు, కరోనా విపత్తులో ముందుండి పనిచేస్తున్న వైద్యసిబ్బంది, పోలీసులు, పాత్రికేయులు, సంఘసేవకులు- వీరికి మాత్రమే జరుగుతున్నాయి. పరీక్షలు జరిపినవారిలో 27 శాతం మందికి వ్యాధినిర్దారణ జరుగుతున్నదంటే, తెలంగాణలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో పరిస్థితి తీవ్రంగా ఉన్నట్టే.

దీనిపై ఒక నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి అమలు చేయకపోతే ఏం జరుగుతుందో ఇపðడు హైదరాబాద్‌లో అదే జరుగుతోంది. ఇపðడు పరిస్థితి చేజారేలా ప్రమాదం ఉంది. ఇపðడు జంటనగరాలలో ఏవి కంటెయిన్మెంట్‌ ప్రాంతాలు, ఏవి కావు అన్న తేడా లేకుండా పోయింది.

ఈ విషయంలో కేసీఆర్‌ సర్కార్‌ ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే పైవేటు ఆస్పత్రులు ఆయా ఫీజులకు మించి వసూలు చేయకూడదని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కానీ అది క్షేత్రస్థాయిలో అమలు అవుతున్నట్లు కనిపించడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అసవరం ఎంతైనా ఉంది.

ప్రపంచ మహమ్మారి వ్యాధి కనుక కార్పొరేట్‌ వైద్య వ్యయాన్ని భరించేందుకు ప్రభుత్వమే ముందుకు రావలసి ఉంటుంది. కరోనా బారిన పడిన వారందరికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకుని వైద్యం అందించాలి. కార్పొరేట్‌ ఆసుపత్రి అయినా, ప్రభుత్వ ఆసుపత్రి అయినా అందరికీ ఒకే రకమైన చికిత్స అందించేలా విధి విధానాలు రూపొందించి అందుకు అయ్యే మొత్తం వ్యయం ప్రభుత్వమే భరించాలి.

________________________________________________________________

కష్టకాలంలోనూ అండగా జగన్‌ సర్కార్‌ 

 

 

కరోనా వైద్యాన్ని ఆరోగ్య శ్రీ పరిధిలోనికి తీసుకురావడం ద్వారా ఏపీ సీఎం జగన్‌ జనానికి దగ్గరయ్యారు. కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత కారణంగా కరోనా సోకిన వారు ఎవరు, ఎవరికి సోకలేదు అన్న అనుమానాలు ప్రతి ఒక్కరిలో కనిపిస్తున్నాయి.

స్వీయ జాగ్రత్తలు తీసుకుంటూ మహమ్మారితో కలిసి జీవించక తప్పదని దేశంలో అందరి కంటే ముందుగానే గుర్తించిన జగన్‌..డేవన్‌ నుంచి అంటే తొలి రోజునుంచీ కూడా జనంలో స్వీయ నియంత్రణపై చైనత్యం కలిగించేందుకే అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

అదే సమయంలో కరోనా సోకిన వారికి పౌష్టికాహారం అత్యవసరం కనుక...క్వారంటైన్‌ లో చికిత్స పొంది వ్యాధి నుంచి బయటపడి ఇళ్లకు వెళుతున్న వారికి రెండు వేల రూపాయల నగదు సహాయం చేయడం ద్వారా ప్రభుత్వం ఔదార్యాన్ని ప్రదర్శించడమే కాకుండా.

సమస్య నుంచి బయటపడడానికి ఒక మార్గాన్ని కూడా చూపి అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ గ్రామానికి ఆ గ్రామం ఒక యూనిట్‌ గా తీసుకుని పరీక్షల నిర్వహణకు పూనుకోవడం వల్ల దేశంలోనే అత్యధిక సంఖ్యలో పరీక్షలు చేసిన రాష్ట్రంగా ప్రశంసలు అందుకుంది.

అయితే వ్యాధి సోకకుండా అంటే కరోనా వ్యాప్తి కట్టడికి సహకరించాల్సిన జనంలో సామాజిక దూరం పట్ల ఇప్పటికీ అవగాహన వచ్చినట్లు కనిపించదు. ఏపీలో కట్టడి ప్రాంతాలలో కూడా జన సంచారం మామూలు రోజుల లోలాగే ఉంటున్నది.

ఈ విషయంపై ముఖ్యమంత్రి జగన్‌ దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. గొలుసు కట్టు తరహాలో కరోనా వ్యాప్తి జరుగుతున్న నేపథ్యంలో గొలుసు (ఛెయిన్‌)ను పగలగొట్టాల్సిన అవసరం ఉంది. అంటే ఎవరికైనా వ్యాధి సోకితే ఆ ప్రాంతంలో నిషేధాజ్ణలు కట్టుదిట్టంగా అమలు చేయాల్సిన అవసరం ఉంది.

అందుకు అవసరమైతే ఒకింత కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏది ఏమైనా కరోనా కష్ట కాలంలో జగన్‌ సర్కార్‌ ప్రజా ప్రభుత్వం నిర్వర్తించాల్సిన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించింది. అయితే ఊదారత మరీ ఎక్కువ అవ్వడంతో వ్యాధి వ్యాప్తి నిరోధం కోసం కంటే వ్యాధి వచ్చిన తరువాతి చర్యలపైనే ఎక్కువ దృష్టి సారించింది.

దీనిని తప్పు పట్టడం కాదు..కానీ కరోనా సోకిన వారి పట్ల ప్రేమా సానుభూతీ చూపుతూనే...తమ నిర్లక్ష్యం కారణంగా వ్యాధివ్యాప్తికి కారకులౌతున్న వారి పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది.

________________________________________________________________

For more updates:

Follow us on Facebook

 News 9 Telugu Daily

Join our Facebook group

News 9 Telugu Daily Public Group

Follow us on Instagram:

News 9 India