ALL పడకంటి మనసులో మాటలు ...
పడకంటి మనసులో మాట 19.07.2020
July 19, 2020 • Venkateshwarlu • పడకంటి మనసులో మాటలు ...

పడకంటి మనసులో మాట.....

___________________________________________________________

తొలి రోజుల్లో చూపినంత చొరవను, వ్యూహ నిపుణతను భారతదేశ పాలకులు తరువాత కాలంలో చూపడం లేదన్న విమర్శలూ ఉన్నాయి. ఆస్పత్రుల్లో వసలుత కొరత, సకాలంలో వైద్యం అందకపోవడం, టెస్టులు చేయక పోవడం మన వ్యవస్థీకృత లోపాలను ఎత్తి చూపుతోంది. భారతదేశం జనాభా 130 కోట్లు. ఆ జనాభాకు ఒక మిలియన్‌ కేసులు అన్నది పెద్ద విషయం కాదన్న వాదన కూడా పాలకుల మాటల్లో వినిపిస్తున్నది. మొత్తం జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే, అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాలలోని మరణాల రేటుకు మనకు పోలికే లేదు. ప్రతి మిలియన్‌కు కేసుల సంఖ్యను చూస్తే భారతదేశం 106 వ ర్యాంకులో ఉన్నది.

___________________________________________________________

వ్యవస్థీకృత లోపాలను సరిదిద్దాలి 

 

కరోనా ప్రపంచ మమమ్మారి. ఈ వైరస్‌ను అంతం చేయడానికి ఏ దేశానికి ఆ దేశం పోరాడితో, ప్రయత్నిస్తే సరిపోదు. ప్రపంచ దేశాల సమష్టి కృషి మాత్రమే కనిపించని మహమ్మారితో పోరులో మానవ విజయాన్ని సాకారం చేయగలుగుతుంది. వాస్తవానికి ప్రపంచంలోని చాలా దేశాలతో పోలిస్త్తే, భారతదేశంలో వ్యాప్తి, మరణాల రేటు తక్కువగా ఉందని అనిపిస్తుంది.

కరోనా కేసుల నవెూదు విషయంలో ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నప్పటికీ వ్యాప్తి రేటు, మరణాల శాతంను బట్టి చూస్తే భారత్‌ ఒకింత మెరుగైన పరిస్థితుల్లోనే ఉందని చెప్పడానికి సందేహించాల్సిన అవసరం లేదు. ఇందుకు కారణం వెూడీ సర్కార్‌ కరోనా వైరస్‌ విషయంలో వేగంగా స్పందించి మార్చి మూడో వారంలోనే, దేశంలో కేసుల సంఖ్య వెయ్యికి కూడా చేరకముందే, పూర్తి లాకడౌేన్‌ను విధించడం వ్యాప్తి తగ్గడానికి కారణం.

అయితే, తొలి రోజుల్లో చూపినంత చొరవను, వ్యూహ నిపుణతను కేంద్రం తరువాత కాలంలో చూపడం లేదన్న విమర్శలను కొట్టిపారేయలేం. ఆస్పత్రుల్లో వసలుత కొరత, సకాలంలో వైద్యం అందకపోవడం, టెస్టులు చేయక పోవడం మన వ్యవస్థీకృత లోపాలను ఎత్తి చూపుతోంది.

వాటిని సాధ్యమైనంత త్వరగా సవరించుకుని ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. భారతదేశం జనాభా 130 కోట్లు. ఆ జనాభాకు ఒక మిలియన్‌ కేసులు అన్నది పెద్ద విషయం కాదన్న భావన ప్రభుత్వ వాదనలో వినిపిస్తున్నది. మొత్తం జనాభాను ప్రాతిపదికగా తీసుకుంటే, అమెరికా, బ్రెజిల్‌ వంటి దేశాలలోని మరణాల రేటుకు మనకు పోలికే లేదు.

ప్రతి మిలియన్‌కు కేసుల సంఖ్యను చూస్తే భారతదేశం 106 వ ర్యాంకులో ఉన్నది. భారత్‌లో ప్రతి పదిలక్షలకు 658 మందికి కరోనా సోకగా, అమెరికాలో దానికి 16రెట్లు, రష్యాలో 5 రెట్ల వ్యాప్తి ఉన్నది. మరణాలలో చూస్తే అమెరికాలో ప్రతి మిలియన్‌ జనాభాకు 392 మంది మరణిస్తుండగా, భారత్‌లో 14.2 మాత్రమే చనిపోతున్నారు.

జనాభా నిష్పత్తిని పరిగణించకపోతే, కేసుల సంఖ్య రీత్యా భారత్‌ ప్రపంచంలో మూడో స్థానంలో ఉన్నది. మరణాల సంఖ్యలో ఎనిమిదో స్థానంలో ఉన్నది. కొవిడ్‌ కేసుల సంఖ్య పదిలక్షలకు చేరడం సాంకేతికమేనని, కోలుకున్నవారిని మినహాయిస్తే, ప్రస్తుతం మూడున్నర లక్షల మంది వ్యాధి గ్రస్తులే చికిత్సలో ఉన్నారని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వ శాఖ చెబుతున్నది.

ఈ సంఖ్య భారతదేశ సామర్థ్యానికి లోబడే ఉన్నదని, వ్యాప్తి కట్టడికి తీసుకుంటున్న వివిధ చర్యల వల్ల వ్యాధి సోకిన వారి సంఖ్యను ఎప్పటికపðడు మితివిూరకుండా చూడగలుగు తున్నామని ఆ శాఖ వర్గాలు అంటున్నాయి. కట్టడి చర్యల విషయంలోనే, ముఖ్యంగా దీర్ఘకాలం లాకడౌేన్‌ తరువాతి ప్రస్తుత సడలింపుల దశలోని నియంత్రణల విషయంలో, వివిధ వర్గాలకు అసంతృప్తి ఉన్నది.

దేశంలో కొవిడ్‌ కేసులు లక్ష సంఖ్యను చేరడానికి 110 రోజులు పడితే, ఆ తరువాతి 9 లక్షలు కేవలం 59 రోజుల్లో నవెూదయ్యాయి. ఈ 59రోజులు, లాకడౌేన్‌ సడలింపుల తరువాతివే అని వేరే చెప్పనక్కరలేదు. భారతదేశంలో పరీక్షల సంఖ్యను,కేసుల సంఖ్యను, మరణాల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని అంతర్జాతీయంగా విమర్శలుఉన్నాయి.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ కూడా భారతదేశంలో చేయవలసినన్ని పరీక్షలు చేస్తే, కేసుల సంఖ్య పెరుగుతుందని, భవిష్యత్తులో ఇండియాలో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతుందని వ్యాఖ్యానించారు. ఇప్పటిదాకా ఎదురయిన పరిస్థితిని ఎదుర్కొనేందుకు లాకడౌేన్‌ కాలం తగిన వ్యవధిని, వెసులు బాటును ఇచ్చింది. నిజానికి కఠినమైన కట్టడులు అవసరమైన సమయం ఇదే.

ఒక స్పష్టమైన విధానం, కార్యాచరణ ప్రణాళిక, పారదర్శకత వంటివి లేకుండా కరోనాను ఎదుర్కొనడం కష్టమన్నదే నిపుణుల అభిప్రాయం. ప్రపంచపు లెక్కలతో భారత్‌ లెక్కలు పోలిస్తే, అవాంఛనీయమైన ధీమా కలిగినట్టే, భారతదేశంలోని అనేక రాష్ట్రాల లెక్కలను చూసినపðడు ఉదాసీనతకు ఆస్కారం ఏర్పడుతుంది.

అది మంచిది కాదు. ప్రధాని నరేంద్రవెూడీ కరోనా కట్టడి బాధ్యతను రాష్ట్రాలకే వదిలేసి, కేంద్రం పని కేవలం గణాంకాలు వల్లెవేయడమనే విధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా కరోనా కట్టడి చర్యలను మరింత పటిష్టంగా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

___________________________________________________________

లాకడౌన్‌కు వెనుకాడొద్దు కట్టడి చర్యల్లో అలసత్వం కూడదు 

తెలంగాణలో కరోనా వ్యాప్తి తీవ్రత భయం గొలుపుతున్నది. ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌, ఆ చుట్టుపక్కన ప్రాంతాలలో రోజురోజుకూ పెరుగుతున్న కేసుల సంఖ్య ఆందోళన కలిగిస్తున్నది. కరోనా లాకడౌేన్‌ సమయంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు తరచుగా ప్రజలలో భయం పోగొట్టేందుకు, వారికి భరోసా కల్సించేందుకు విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేశారు. 

లాక డౌన్‌ సమయంలో కరోనా నుంచి రాష్ట్రాన్ని సీఎం కాపాడతారన్న ధీమా ప్రజలలో కనిపించింది. కరీంనగర్‌ లో కరోనా వ్యాప్తిని కట్టడి చేయడంలో ఆయన వ్యూహం, వేగం సర్వత్రా ప్రశంసలు అందుకుంది. లాక డౌన్‌ నుంచి అన్‌ లాక డౌన్‌ క్రమంలో కట్టడి చర్యలలో నాణ్యత లోపించింది.

వ్యాప్తి నియంత్రణ చర్యలకు మంగళం పాడేశారా అన్న అనుమానం కలిగేలా రాష్ట్రంలో పరిస్థితులు మారిపోయాయి.ప్రజా ప్రతినిథులు, చివరికి ప్రగతి భవన్‌ సిబ్బంది సైతం కరోనా బారిన పడినా...సీఎం నుంచి కరోనా కట్టడి విషయంలో తీసుకుంటున్న చర్యలు, అమలు చేస్తున్న విధానాలపై ఒక స్పష్టమైన ప్రకటన రాలేదు.

నిజమే కరోనా సోకిన తరువాత కోలుకుంటున్న వారి శాతం జాతీయ సగటుతో పోలిస్తే తెలంగాణలో చాలా మెరుగ్గా ఉంది. అయితే సమస్య ఎక్కడ వస్తున్నదంటే...రాష్ట్రంలో కరోనా నిర్థారణ పరీక్షలు జరగడం లేదన్న అనుమానం, సందేహం ప్రజలలో బలంగా నాటుకుంది.

అంతంత మాత్రం నిర్ధారణ పరీక్షలతోనే వ్యాప్తి ఈ స్థాయిలో ఉంటే..పరీక్షలు పెరిగితే అసలు తీవ్రత తెలుస్తుందన్న అభిప్రాయం జనం వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య మంత్రి ఈటల ఎప్పుడు విలేకరుల సమావేశంలో మాట్లాడినా ఐసీఎంఆర్‌ నిబంధనల మేరకు చేస్తున్నామని చెబుతున్నారు.

అయితే ఒక్క తెలంగాణ మాత్రమే కాదు...దేశంలోని అన్ని రాష్ట్రాలూ కరోనా నిర్ధారణ పరీక్షల విషయంలో ఐసీఎంఆర్‌ మార్గదర్శకాల మేరకే పని చేయాల్సి ఉంటుంది. అలాగే చేస్తున్నాయి కూడా. ఒక్క తెలంగాణకు మాత్రమే ఐసీఎంఆర్‌ ప్రత్యేకంగా మార్గదర్శకాలు జారీ చేస్తుందని భావించజాలం.

పొరుగుల ఉన్న ఏపీలో కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నది. అందుకు కారణం అక్కడ ఎక్కువ సంఖ్యలో పరీక్షలు జరుగుతుండటమే అనడంలో సందేహం లేదు. పరీక్షలు నిర్వహించకుండా, రాష్ట్రంలో వ్యాప్తి తీవ్రత పెద్దగా లేదని చెప్పుకోవడం వల్ల పరిస్థితి మరింత ఉధృతం కావడం తప్ప మరో ప్రయోజనం ఉండదు.

ఈ విషయాన్ని సీఎం సీరియస్‌గా ఆలోచిస్తుట్లే కనిపిస్తున్నది. దిద్దుబాటు చర్యలకు తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. పెరుగుతన్న కేసులు, వస్తున్న విమర్శలతో మరింత పక్కాగా వైద్య సేవలను అందించడంతో పాటు, కఠిన చర్యలకు ఉపక్రమించింది.రెండు రోజుల క్రితం ముఖ్య అధికారులను బదిలీ చేసిన తరవాత సిఎం కెసిఆర్‌ దీనిపై సమగ్రంగా చర్చించారు.

కరోనా తీవ్రత ఉన్నా వైద్యం అందుతోదని ప్రభుత్వం చెప్పింది. మంత్రుల కమిటీని ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు రాష్ట్రంలో కరోనా బారినపడి కోలుకుంటున్నవారి శాతం పెరుగుతున్నది.ఇది సానుకూల అంశం.

అయితే రాష్ట్రంలో ముఖ్యంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా కట్టడి మరింత పకడ్బందీ చర్యలు అవసరమన్న నిపుణుల అభిప్రాయాన్ని ముఖ్యమంత్రి పరిగణనలోనికి తీసుకోవాలి. బెంగళూరు, ముంబై, కోల్‌ కతా మహానగరాలలో కరోనా కట్టడి కోసం లాకడౌేన్‌ విధించారు.

గ్రేటర్‌ పరిధిలో కూడా మరోసారి కఠినంగా లాక డౌన్‌ అమలు చేసే విషయంపై సీఎం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అలాగే ప్రజలు గుమిగూడేందుకు ఆస్కారం ఉన్న ఆదివారం మార్కెట్లు, కాలనీల సంతలను అనుమతించకుండా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది.

వ్యాపార, వాణిజ్య కార్యక్రమాల విషయంలో కూడా నిర్దిష్ట సమయాన్ని కేటాయించడం వల్ల ఏదో మేరకు ప్రయోజనం ఉంటుందేవెూ పరిశీలించాలి. ఏది ఏమైనా లాక డౌన్‌ సడలింపులు ఉన్నాయి కనుక జనం జాగ్రత్తలు పాటించాలన్న సూచన ఒక్కటే కరోనా కట్టడికి సరిపోదన్నది నిర్వివాదాంశం.

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి విసృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలలో మనోధైర్యం కల్పించేందుకు, వారు భయాందోళనలకు గురికాకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో వెనుకాడకూడదన్నది నిపుణుల అభిప్రాయం.

మరోమారు కఠినమైన లాకడౌేన్‌ విధిస్తే రాష్ట్రంలో పరిస్థితి అదుపులోనికి వస్తుందన్న అభిప్రాయం మెజారిటీ ప్రజలలో కూడా వ్యక్తమౌతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా చర్యలు తీసుకునే విషయంలో వెంటనే ఒక నిర్ణయం తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.

మహానగరాలలో మహమ్మారి వ్యాప్తి తీవ్రత సహజంగానే ఎక్కువ ఉంటుంది. ముంబై, ఢిల్లీ, కోల్‌ కతా, పుణె నగరాలలో కేసుల తీవ్రతే ఇందుకు ఉదాహరణ. ఇక ఇప్పుడు అంతర్జాతీయ విమానాల రాకపోకలు కూడా ప్రారంభం కానుండటంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవలసిన అవసరం ఉంది.

________________________________________________________________

భరోసా ఇస్తున్న జగన్‌ నిర్ణయాలు 

ఆంధ్ర ప్రదేశ్‌ లో కరోనా విలయం సృష్టిస్తోంది. రోజు రోజుకూకేసులు వేల సంఖ్యలో పెరుగుతున్నాయి. అదే సమయంలో మరణాల సంఖ్య కూడా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. కరోనా కాలంలో కూడా పేద,బడుగు, బలహీన వర్గాల వారికి సంక్షేమ కార్యక్రమాల లబ్ధి సక్రమంగా చేరుతుండటం ఊరట కలిగించే అంశం.

అదే సమయంలో కరోనా కట్టడి కోసం జగన్‌ సర్కార్‌ కఠిన నిర్ణయాలు తీసుకుని వాటిని పకడ్బందీగా అమలు చేయడానికి నడుంబిగించడం హర్షణీయం. కరోనా కేసుల సంఖ్య, వైరస్‌ వ్యాప్తి తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కడికక్కడ స్థానిక అధికారులే తీసుకోవలసిన చర్యలపై ఒక నిర్ణయానికి వచ్చి వాటిని అమలు చేసే విధంగా జగన్‌ ఆదేశాలు ఇవ్వడం మేలు చేస్తున్నది.

స్థానిక అధికారులు సమన్వయంతో పని చేస్తూ కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. కేసులు అధికంగా ఉన్న ప్రాంతాలలో లాకడౌేన్‌ నిబంధనలకు కఠినంగా అమలు చేయడం...జనం బయటకు తిరిగే సమయాలను కుదించడం తదితర చర్యల ద్వారా కరోనా వ్యాప్తి విస్తృతికి అడ్డుకట్ట వేస్తున్నారు.

శనివారం ఒక్క రోజే తూర్పు గోదావరి జిల్లాలో వెయ్యికి పైగా కేసులు నవెూదు కావడంతో జిల్లా వెూత్తం కఠినమైన కర్ఫ్యూ విధించారు. ఆదివారం అంటే నేటి ఉదయం నుంచి రేపు ఉదయం వరకూ తూర్పుగోదావరి జిల్లా వెూత్తానికి కర్ఫ్యూ విధించారు. ఆ తరువాత కూడా ఆంక్షలు కొనసాగించాలని కలెక్టర్‌ నిర్ణయించారు.

దాదాపు ఇటువంటి ఆంక్షలే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో అమలులో ఉన్నాయి. కరోనా సోకిన వారికి ప్రభుత్వం అండగా ఉంటుందన్న స్పష్టమైన సంకేతాలను ఇవ్వడంద్వారా సీఎం జగన్‌ ప్రజలలో ధైర్యాన్ని నింపారు. అదే సమయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి వ్యాప్తికి కారణమయ్యే వారిపై కఠిన చర్యలకూ వెనుకాడటం లేదు. వైరస్‌ పై పోరాటం, సంక్షేమ కార్యక్రమాల కొససాగింపుతో జగర్‌ సర్కార్‌ ప్రజలకు భరోసా కల్పిస్తోంది.

________________________________________________________________

For more updates:

Follow us on Facebook

 News 9 Telugu Daily

Join our Facebook group

News 9 Telugu Daily Public Group

Follow us on Instagram:

News 9 India